01-09-2025 12:41:12 PM
యూరియాను కూరలో ఉప్పులా వాడాలా.
స్థానిక రైతు కనికి రెడ్డి.
రేగొండ (విజయక్రాంతి): మండల కేంద్రంలోని పిఎసిఎస్(PACS) గోదాం వద్ద రైతులు యూరియా కోసం అగచాట్లు పడ్డారు. సోమవారం వర్షం పడుతున్నా లెక్కచేయకుండా యూరియా బస్తాల కోసం ఉదయం నుండే మండల ప్రజలు బారులు తీరారు. దీంతో ఒక్కసారిగా పిఎసిఎస్ గోదాం వద్ద కొంత ఉద్రిక్తత నెలకొంది. స్థానిక పోలీసులు చొరవ తీసుకొని రైతులను క్యూ లైన్ లో నిల్చోబెట్టారు. రైతులు మాత్రం ప్రభుత్వంపై మండిపడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో యూరియాను అందజేయడంలో పూర్తిగా విఫలమైందని రైతుల కష్టాలు పట్టించుకునే నాయకులే లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పాస్ బుక్ పై ఒక్క యూరియా బస్తానే ఇవ్వడం ఏంటని నిలదీశారు. మూడు రోజులు యూరియా కోసం పడి గాపులు కాస్తే మా మొఖాన ఒక్క బస్తా పడేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
యూరియాను కూరలో ఉప్పులా వాడాలా.
స్థానిక రైతు కనికి రెడ్డి.
సీఎం రేవంత్ రెడ్డికి రైతులపై చిత్తశుద్ధి లేదు.నాకు 5 ఎకరాల సాగు ఉంది ఒక్క బస్తా ఇస్తానంటున్నారు. ఒక్క బస్తాను కూరలో ఉప్పు వాడినట్లు వాడాలా. తెల్లారి లేస్తే సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ లో బుర్రుమని తిరుగుతావ్. జర మా రైతుల మొఖాన చూడు మా గోస కనబడుతది. మార్పు రావాలి మార్పు రావాలి అంటే యూరియా కోసం రైతులు లైన్లో నిల్చునే మార్పు వచ్చింది.