01-09-2025 12:35:49 PM
వేములవాడ టౌన్ (విజయక్రాంతి): వేములవాడ అర్బన్ మండలం అర్ధరాత్రి ఆశ వర్కర్ అరెస్టు చేయడం దారుణం.. పోలీస్ స్టేషన్లో పెట్టడం చాలా దారుణం.. గ్రామాలలో రాత్రి, పగలు కరోనా సమయంలో కూడా వారి ప్రాణాలను వారి కుటుంబాలను సైతం లెక్కచేయకుండా పేద ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఆశా వర్కర్లను వారి న్యాయబద్ధమైన సమస్యల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి వారు కార్యక్రమాలు చేస్తామనుకుంటే వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టి భయభ్రాంతులకు గురిచేయడాన్ని భారతీయ జనతా పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం వారి సమస్యలు పరిష్కరించకుంటే వారికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నాం.