calender_icon.png 4 September, 2025 | 8:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చందానగర్ లో చిన్న పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా గుట్టురట్టు

01-09-2025 12:59:29 PM

- ఒకరి అరెస్ట్, మరో ముగ్గురి కోసం గాలింపు

- చందానగర్ పోలిస్ స్టేషన్ పరిధిలో ఘటన

శేరిలింగంపల్లి: చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టును చందానగర్ పోలీసులు(Chandanagar Police) రట్టు చేశారు. ఈ ముఠాను అదుపులోకి తీసుకొని నలుగురు చిన్నారులను కాపాడారు. ఈనెల 25న లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద రమేష్(1) అనే బాలుడు తప్పిపోయాడు. రమేష్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న చందానగర్ పోలీసులు ఆ కేసును దర్యాప్తు చేస్తుండగా పిల్లలను కిడ్నాప్ చేసి విక్రయిస్తున్న ముఠా ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై లోతుగా దర్యాప్తు చేపట్టిన మియాపూర్ పోలీసులు సీసీ టీవీ పుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా తనతో పాటు మరో ముగ్గురు ఉన్నట్టు వెల్లడించాడు. నలుగురు నిందితులు ఒక ముఠాగా ఏర్పడి పిల్లలను కిడ్నాప్ చేస్తున్నట్లు నిర్ధారణ అయ్యింది. ఈ కిడ్నాప్ ముఠాకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాపు చేస్తున్నారు.