calender_icon.png 25 September, 2025 | 10:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామగుండంలో భారీ వర్షం.. బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

25-09-2025 09:20:13 AM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం వర్షం(Heavy rain) కురుస్తోంది. పెద్దపల్లి జిల్లా రామగుండంలో(Ramagundam) గురువారం తెల్లవారుజామునుంచే ఏకాధాటిగా వర్షం కురుస్తోంది. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో రామగుండం పరిధిలో 4 ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని అధికారులు వెల్లడించారు. రామగుండం ఉపరితల గనుల్లో భారీగా వరదనీరు చేరింది. ఉపరితల గనుల్లో వర్షపునీటిని అధికారులు మోటార్లతో తోడిపోస్తున్నారు. భారీ వర్షం  రామగుండంలో 40 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగిందని సంబంధిత అధికారి పేర్కొన్నారు.