calender_icon.png 25 September, 2025 | 10:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సదాశివపేట మండలం ఎరేన్ లైఫ్ సైన్స్ కంపెనీలో ప్రమాదం

25-09-2025 08:39:07 AM

తీవ్రంగా గాయపడ్డ నలుగురు కార్మికులు

సదాశివపేట,(విజయక్రాంతి): సదాశివపేట మండలం (Sadashivapet Mandal) ఎరేన్ లైఫ్ సైన్స్, కంపెనీ లో ప్రమాదం బుధవారం రాత్రి, కెమికల్ లీకై నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడి సంగారెడ్డిలోని బాలాజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.. ఈ ఘటన తెలుసుకున్న  సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అతిమేల మానిక్ కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు న్యాయవాది సుభాష్ సిఐటియు నాయకులు వంశీ బాలాజీ హాస్పిటల్ లో కార్మికులను పరామర్శించారు.. డాక్టర్ శ్రీధర్ గాయపడిన కార్మికులను చూసి వారి పరిస్థితిని బట్టి హైదరాబాద్ తరలించాలని సూచించారు. ఈ సందర్భంగా అతిమేల మాణిక్ మాట్లాడుతూ గాయపడిన కార్మికులకు కార్పొరేట్ వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.. యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగి కార్మికులు తీవ్ర గాయాల పాలైనారని అన్నారు.. గాయపడ్డ కార్మికులు శివారెడ్డి, శ్రీనివాస్, దివాకర్, సింహాచలం, వీరిలో ముగ్గురికి ముఖము చేతులు కాళ్ళు శరీర భాగాలు  కాలిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సమాచారం.