calender_icon.png 25 September, 2025 | 10:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు..10 మందికి గాయాలు

25-09-2025 09:09:19 AM

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా( Nizamabad district) డిచ్ పల్లి మండలం సుద్దపల్లి వద్ద గురువారం రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చి అదుపుతప్పిన ట్రావెల్స్ బస్సు 44వ జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. లారీని ఢీకొట్టి తర్వాత ట్రావెల్స్ బస్సు డివైడర్ పైకి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో బస్సులోని 22 మంది ప్రయాణికుల్లో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ రోడ్డు ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక విచారణ తెలింది.