calender_icon.png 17 September, 2025 | 9:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగరంలో దంచికొడుతున్న వర్షం

17-09-2025 06:58:55 PM

హైదరాబాద్: నగరంలో ఉదయం నుంచి పొడి వాతావరణం ఉండగా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం, ఎస్ ఆర్ నగర్, అమీర్ పేట్, మియాపూర్‌, చందానగర్‌ లో వర్షం(Rain) భీభత్సంగా పడుతుంది. కొండపూర్, గచ్చిబౌలి, ఖైరతాబాద్, ఎర్రమంజిల్, పంజాగుట్ట, కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతల్లో వర్షం పడుతోంది. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో ఒక్కసారిగా వాహనాలు రోడ్లెక్కడంతో నగరంలో భారీగా ట్రాఫిక్ నెలకొంది. వర్షపు నీరు రోడ్లపై చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ ఉండడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్నిచోట్ల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. నగరంలో వర్షం మొదలైనందున జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీసులు అప్రమత్తం అయ్యారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలలో జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.