calender_icon.png 26 September, 2025 | 1:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వికారాబాద్ జిల్లాలో కుండపోత వర్షం.. పొంగిపొర్లుతున్న వాగులు

26-09-2025 11:26:37 AM

తాండూరు,(విజయక్రాంతి): గత రాత్రి నుండి వికారాబాద్ జిల్లాలో( Vikarabad district) ఏకధాటిగా కుండపోత వర్షం(Heavy rain ) కురుస్తుంది. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. తాండూరు నియోజకవర్గం లోని కోటిపల్లి సాగునీటి ప్రాజెక్టు లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో అలుగు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తుంది. తాండూర్ మండలం బెల్కటూరు వాగు(Belkatur Vaagu) పొంగి పొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బిజ్జారం వాగు సైతం పొంగి పొర్లుతుండడంతో గ్రామానికి రాకపోకలు తెగిపోయాయి.కాగ్న నదిలోకి భారీ వర్షపు నీరు రావడంతో ఉధృతంగా ప్రవహిస్తుంది . తాండూర్ పట్టణంలోని పలు కాలనీలు నీటిలో మునిగిపోయాయి . మరోవైపు గత కొన్ని రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు పత్తి పంట నల్లబారి రైతన్నలకు తీవ్ర నష్టం  కలుగనుందని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.