18 April, 2026 | 7:52 AM

యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షం

03-05-2025 01:47 AM
  1. ఐకేపీ సెంటర్లలో ధాన్యం వరద పాలు.

నేలరాలిన మామిడి పండ్లు రైతులకు తీరని నష్టం 

యాదాద్రి భువనగిరి మే 2 ( విజయ క్రాంతి ) : యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం గాలి దుమారాలతో రాళ్ల వర్షం కురిసి బీభత్సాన్ని సృష్టించింది.  ఇళ్లపై కప్పులు ఎగిరిపోయి ఫ్లెక్సీ బోర్డులు విరిగిపోగా, చెట్లు, కొమ్మలు నేల కులాయి. విద్యుత్ స్తంభాలు నేలకు వరగడంతో విద్యుత్ స్తంభించింది. చాలాకాలం తర్వాత రాళ్ల వర్షం పడడంతో ప్రజలు ఆసక్తి కనపర్చగా పిల్లలు ఒకింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.

దాదాపు 40 నిమిషాల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం వరదలై పారింది. అకాల వర్షాలు రైతన్నలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. జిల్లాలో దాదాపు 60 శాతం ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే కాంటాల కై ఎదురుచూస్తుంది. ధాన్యం కొనుగోళ్ల  నత్త నడక కారణంగా అకాల వర్షాలతో  రైతన్నలు ఆరుగాలం పండించిన పంట నీటిపాలవుతుంది. జిల్లాలో అనేక ఐకెపి సెంటర్ లో కుప్పలు కుప్పలుగా ధాన్యం రాశులు ఉన్నాయి.

వర్షానికి తడవకుండా తాడిపత్రిలు కప్పిన గాలి దుమారాలకు ఎగిరిపోయి ధాన్యం వరద నీటిలో కొట్టక పోయింది. ప్రతి అకాల వర్షాలలో ధాన్యం వరదలో కొట్టుకపోవడం రైతులు తడిసిన ధాన్యాన్ని ఎత్తుకోవడం నిత్య కృత్యమైంది.  భారీ వర్షానికి భువనగిరి పట్టణంలోని కాలేజ్ గ్రౌండ్, బస్టాండ్ లోతట్టు ప్రాంతాలని జలమయమయ్యాయి.

గ్రౌండ్, బస్టాండ్ ప్రాంతాలు చెరువులను తలపించే విధంగా నీళ్లు నిలిచిపోయాయి. డ్రైనేజీలు పొంగి పడడంతో ఆ నీరు అంతా రోడ్ల మీద ప్రవహిస్తున్నాయి. అస్తవ్యస్తంగా తయారైన డ్రైనేజీ వ్యవస్థ కారణంగా మురికి నీరంతా లోతట్టు ప్రాంతాల వారి ఇళ్లలోకి చేరుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు.