18 April, 2026 | 6:00 AM

రోజులు గడుస్తున్నా కాంటాలు వేయడంలో నిర్లక్ష్యం

03-05-2025 01:46 AM

సూర్యాపేట, మే 2: సూర్యాపేట మండలం రాజ్ నాయక్ తండాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో తాము పండించిన పంటను కాంటాలు వేయడంలో నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన చెందిన రైతులు శుక్రవారం రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. తమ ధాన్యాన్ని కేంద్రానికి తీసుకువచ్చి రోజులు గడుస్తున్న నిర్వాహకులు తూకం వేయకుండా కాలం వెళ్లదీస్తున్నారని, ఎంతో శ్రమించి, అప్పుచేసి మరీ పంటను పండించామని ఆవేదన వ్యక్తంచేశారు.

వాతావరణంలో మార్పులతో ఏ క్షణాన ఆకాల వర్షం పడి ధాన్యం తడిసిపోతుందోనని ఆందోళన చెందుతున్నామన్నారు. నిర్వాహకులు మాత్రం ఇవేమీ పట్టనట్లు లారీలు రావడం లేదనే సాకుతో కాంటాలు ఆపి వేశారని, ఈ క్రమంలో 5 రోజులకు ఒక్క లారీతో కేంద్రంలోని ధాన్యాన్ని కాంటాలు చేస్తామంటున్నారని, ఇలా ఎన్ని రోజులపాటు కాంటాలు వేస్తారని, ఆకాల వర్షాలు కురిస్తే ఎవరు బాధ్యులని రైతుల ప్రశ్నించారు. సుమారు గంట పాటు రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.