calender_icon.png 3 September, 2025 | 6:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో అన్నదానం

01-09-2025 12:26:39 AM

రేగొండ/భూపాలపల్లి ఆగస్టు 31( విజయ క్రాంతి): గణపతి నవరాత్రి ఉత్సవాలు ఊరురా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 5 వ రోజు పురస్కరించుకొని భూపాలపల్లి జిల్లాలోని కారల్ మారక్స్ కాలనీ 25వ వార్డులో విగ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

దీంతో పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ విఘ్నేశ్వరున్ని దర్శించుకుని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. స్థానిక యువకులు, దాతల సహకారంతో చేపట్టిన అన్న ప్రసాద కార్యక్రమం ఘనంగా జరిగింది. కమిటీ తరపున ప్రతిరోజు ప్రత్యేక పూజలు, హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు భక్తులందరికీ మహా అన్నప్రసాద కార్యక్రమాలు దాతలచే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, స్థానిక యువకులు, పెద్దలు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.