01-09-2025 12:25:36 AM
మహబూబాబాద్, విజయక్రాంతి : గణేష్ చతుర్థి వేడుకలను పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లాలో గణనాధులను విభిన్న అలంకరణలతో తీర్చిదిద్దారు. గణేష్ చతుర్థి వేడుకల్లో భాగంగా ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో ఆది దేవుడి మంటపాన్ని బెలూన్లతో ఆకర్షనీయంగా తీర్చిదిద్దగా, కేసముద్రంలో శాకంబరుడిగా అలంకరిం చారు. రెండు విభిన్న రూపాల్లో గణనాథులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు.