calender_icon.png 1 September, 2025 | 1:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు ఉత్తమ క్రీడాకారులుగా రాణించాలి: బెల్లంపల్లి ఎసిపి రవికుమార్

31-08-2025 08:05:35 PM

మందమర్రి,(విజయక్రాంతి): విద్యార్థులు చదువుతోపాటు క్రీడా రంగాల్లో రాణించి ఉత్తమ క్రీడాకారులుగా ఎదగాలని తద్వారా భవిష్యత్తు బంగారు మయం చేసుకోవాలని బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ కోరారు. పట్టణంలోని సింగరేణి కమ్యూనిటీ హాల్లో ఆదివారం రాష్ట్ర స్థాయి కుంగ్ ఫు, కరాటే పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుండి చదువులో రాణిస్తూనే క్రీడలపై ఆసక్తి పెంచుకొని ఉత్తమ క్రీడాకారులుగా ఎదగాలన్నారు క్రీడలతో దేహదారుడ్యo పెంపొందడంతో పాటు మానసికొల్లాసం కలుగు తుందని క్రీడల్లో రాణించడం ద్వారా ఉన్నతమైన భవిష్యత్తు ఉంటుందన్నారు.

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి చదువు, క్రీడలపై దృష్టి సారించి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని కోరారు. అనంతరం నిర్వ హించిన రాష్ట్రస్థాయి పోటీ లలో పెండ్యాల శ్రీకృతి, కె శాన్విత్ వర్మ, ఎం అద్విక్, వి తరుణ్ తేజ్, సమన్విత, విశ్వాని, వర్షిత్, సాయిలు  ప్రథమ స్థానం సాధించగా, ద్వితీయ స్థానంలో కార్తికేయ, విహాన్, శ్రీ వర్ధన్, అన్విత్, శశికాంత్, తృతీయ స్థానంలో లక్ష్మీనరసింహ, నవీన్ తేజ, విశ్వతేజ, రెస్వాంత్ వర్మ, హర్షిత్, విజేతలుగా నిలిచారు. వీరికి బెల్లంపల్లి ఎసిపి బహు మతులు, మెమెంటోలను ప్రధాన చేశారు.