29-09-2025 01:04:30 AM
నిర్మల్, సెప్టెంబర్ 28( విజయక్రాంతి): నిర్మల్ జిల్లా బాసరలో జరి గే శ్రీ శారదీయ శరన్నవరాత్రి మహోత్సవం సందర్భంగా, శ్రీ సరస్వతి అమ్మవారి జన్మ నక్షత్రం అయిన మూల నక్షత్రం రోజున (సోమ వారం) ఇలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసు బందోబస్తు నిర్వహించినట్టు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు.
తెల్లవారుజామున జరిగే మహా అక్షరాభ్యాస కార్యక్రమానికి భక్తులు అధికసంఖ్యలో వస్తారు కనుక విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ భద్రతా ఏర్పాట్లను ఎస్పీ డా. జి. జానకి షర్మిల పర్యవేక్షించారు. అలాగే నిర్మల్ జిల్లా సారంగాపూర్ మం డలంలోని ప్రాచీన దేవాలయమైన అడెల్లి పోచమ్మ గంగనీల జాతర ఆదివారం వైభవంగా ముగిసింది జాతర సందర్భంగా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు