calender_icon.png 29 September, 2025 | 1:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

29-09-2025 01:04:42 AM

ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

కామారెడ్డి, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): కార్యకర్తలను ప్రజాప్రతినిధులుగా చేసే ఎన్నిక స్థానిక సంస్థల ఎన్నికలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. ఆదివారం బిజెపి జిల్లా కార్యాలయంలో పదాధికారుల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు జెడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ లు ఖరారు అయిన నేపథ్యంలో రాబోయే ఎన్నికల సన్నద్ధత పై బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు అధ్యక్షతన బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా పదదికారుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకుల నుండి జిల్లా మండల, బూత్ స్థాయి నాయకుల వరకు ప్రతి బీజేపీ కార్యకర్త స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలనీ పిలుపునిచ్చారు. కార్యకర్తలను ప్రజాప్రతినిధులుగా చేసే ఎన్నికలు కాబట్టి పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తను గెలిపించుకోవాలని, ప్రతి ఒక్కరు బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం పని చేయాలనీ అన్నారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు, రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి, సీనియర్ నాయకులు మురళీధర్ గౌడ్, పోతంగల్ కిషన్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.