2 May, 2026 | 2:11 AM

పేదలకు చేయూత.. ‘ఇందిరమ్మ’ఇల్లు

12-03-2026 12:00 AM
  1. షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
  2. లింగారెడ్డిగూడెంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం చేయించిన ఎమ్మెల్యే 
  3. రూ.30 లక్షలతో సిసి రోడ్డు, అండర్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

షాద్ నగర్, మార్చి 11 (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇల్లు గూడు లేని నిరుపేదల ప్రజలకు వరాల జల్లు అని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఫరూక్ నగర్ మండలం లింగారెడ్డిగూడెం గ్రా మంలో బుధవారం లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో గృహప్రవేశం అంగరంగ వైభవంగా చేయించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ ఇందిరమ్మ గృహ లబ్ధిదారు దంపతులకు నూతన వస్త్రాలు పెట్టి ఆశీస్సులు అందించారు. అనంతరం మాట్లాడుతూ నిరుపేదలను ఇంటి యజమా నులను చేసే కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని దానిని అంకితభావంతో నిర్వహిస్తున్నామని వెల్లడించా రు.

మాజీ ఎమ్మెల్యే  బక్కని నర్సింహులు మాట్లాడుతూ నిరుపేదలకు ఇందిరమ్మ ఇంటిని అందించి వారికి గూడు చూపించే కార్యక్రమం మంచి కార్యక్రమం అని అభినందించారు. సర్పంచ్ ఎంసీ రాజు, ఉప సర్పంచ్ ఎర్రోళ్ల అశోక్ కార్యక్రమంలో  హాజరైన ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి వారికి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రగతి పనులకు శంకుస్థాపన.. 

అదేవిధంగా గ్రామంలో 30 లక్షల రూపాయలతో సిసి రోడ్డు, అండర్ డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శంకుస్థాపన చేశారు. గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. వార్డు సభ్యులు మల్లేష్ యాదవ్, దీపిక, వీరేష్ గౌడ తదితరులు పాల్గొన్నారు.