13 August, 2026 | 4:03 AM

నిమ్స్ ఆసుపత్రికి హెల్ప్‌నీడీ సంస్థ విరాళం

13-08-2026 12:14 AM

అభినందించిన డైరెక్టర్ రాహుల్ దేవరాజ్

పంజాగుట్ట, ఆగస్టు12 (విజయక్రాంతి): నిమ్స్ ఆసుపత్రికి హెల్ప్ నీడీ స్వచ్ఛంధ సంస్త 30 చక్రాల కుర్చీలను విరాళంగా అందించింది.దాతల సహకారంతో ఈ కుర్చీలను అందించినట్లు సంస్థ పేర్కొంది. బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాహుల్ దేవరాజ్ కుర్చీలను స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్ప్ నీడీ సంస్థ చొరవను అభినందించారు.చక్రాల కుర్చీలను విరాళంగా ఇచ్చేందుకు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

కుర్చీలు రోగులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.స్వచ్ఛంధ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ ఒక్కో కుర్చీ రూ.11,500ల విలువ చేస్తాయన్నారు. సీత అన్నపూర్ణ కాంతమనేని గుర్తుగా 5 చక్రాల కుర్చీలు, రావి చిట్టెమ్మ గుర్తుగా 4 కుర్చీలను, సుశీలాదేవి సఖమూరు, శ్రీరామమూర్తి సఖమూరు గుర్తుగా 10 దాతలు ఇచ్చారన్నారు.ఆర్.చిట్టి శ్రావ్య 2 కుర్చీలు ఇవ్వగా,హెల్ప్ నీడీ సంస్థ 9 చక్రాల కుర్చీలను స్వతహాగా అందజేయడం జరిగిందని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో నిమ్స్ అసిస్టెంట్ మెడికల్ సూపరింటిండెంట్ సల్మాన్,ఆర్‌ఎంఓ సచిన్,ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.