21-08-2025 04:26:27 PM
యువ రోగి ప్రాణాలు కాపాడిన వైద్యులు..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): అత్యాధునిక గ్యాస్ట్రో ఎంటిరాలజీ సర్జరీ ద్వారా డ్యూడెనల్ పెర్ఫరేషన్(Duodenal perforation) రోగి ప్రాణాలను మలక్‌పేట, యశోదా ఆసుపత్రి(Yashoda Hospitals) వైద్య బృందం కాపాడిందని సర్జికల్ గ్యాస్ట్రి ఎంటిరాలజీ వైద్య నిపుణులు డా. వెంకటేష్ శ్రీపతి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని మనోరమ హోటల్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నల్లగొండ పట్టణానికి చెందిన బుర్రా రంజిత్ అనే రోగి మూడు రోజులుగా కడుపు ఉబ్బరం, జ్వరం, విరేచనాలతో బాధపడుతూ, ఇతర స్థానిక ఆసుపత్రుల్లో ఆక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్, పైలోనెఫ్రైటిస్, పారాలిటిక్ ఐలియస్ అనుమానాలతో చికిత్స పొందాడని పేర్కొన్నారు. శ్వాసలో ఇబ్బంది పెరగడంతో, అతన్ని హైదరాబాద్ మలక్‌పేట్ యశోదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి రిఫర్ చేశారని తెలిపారు. డ్యూడెనల్ పర్ఫొరేషన్ డ్యూడెనమ్ గోడలో కడుపు తరువాత ఉండే చిన్న ప్రేగు మొదటి భాగంలో రంధ్రం ఏర్పడినప్పుడు సంభవిస్తుంది.
దీని వల్ల ప్రేగులోని పదార్థం కడుపు లోపలి భాగంలోకి లీకై తీవ్రమైన ఇన్ఫెక్షన్ (పెరిటోనిటిస్) వస్తుందన్నారు. చాలా సందర్భాల్లో డ్యూడెనల్ పర్ఫొరేషన్ ఆకస్మికంగా తీవ్రమైన కడుపు నొప్పితో వస్తుందని ఎక్స్‌రే లేదా సీటీ స్కాన్‌లో కడుపులో గ్యాస్ కనిపించడం ద్వారా సులభంగా గుర్తించామన్నారు.అద్భుతమైన వైద్య పరిజ్ఞానం, శస్త్రచికిత్సా నైపుణ్యంతో, హైదరాబాద్ మలక్‌పేట్ యశోదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్య బృందం ఒక అరుదైన దాగి ఉన్న డ్యూడెనల్ పర్ఫొరేషన్ కేసును విజయవంతంగా గుర్తించి, 22 సంవత్సరాల యువ రోగి ప్రాణాలను కాపాడమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జనరల్ మేనేజర్ శ్రీనివాస్ చిదుర, వాసు కిరణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.