30-07-2025 01:34:50 AM
హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): చేసిన పనికి ఒకవైపు జీతం రాక.. మరోవైపు ఈ విద్యాసంవత్సరానికి కొంతమంది ఉద్యోగాలు రెన్యువల్ కాక గెస్ట్ ఫ్యాకల్టీ అధ్యాపకులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టు కాళ్లరి గేలా తిరుగుతున్న సమస్య మాత్రం పరిష్కారానికి నోచుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత విద్యా సంవత్సరంలో నాలుగు నెలలకు సం బంధించిన జీతాలు ఇంతవరకూ విడుదల కాలేదు.
దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బం దులు పడుతున్నారు. అప్పుచేసి కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. అధికారులకు తమ గోడు చెబుదామని హైదరాబాద్ రావాలన్నా దారి ఖర్చులకు డబ్బుల్లేవని ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. దాదాపు ఎనిమిది నెలలుగా జీతాల్లేక గెస్ట్ అధ్యాపకులు కుటుంబ పోషణ భారమై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గత విద్యాసంవత్సరంలో 1,654 మంది గెస్ట్ అధ్యాప కులు విధులు నిర్వర్తించేవారు. అయితే వీరికి 2024 విద్యాసంవత్సరంలో డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెల వేతనాలు నూతన విద్యాసంవత్స రం ప్రారంభమై ఆగస్టు నెల రావొస్తున్నా తమ బ్యాంకు ఖాతాల్లో జమకా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వచ్చేవే అరకొర వేతనాలు..
రాష్ట్రవ్యాప్తంగా 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1,654 మంది గెస్ట్ అధ్యాపకులు పన్నెండేళ్ల నుంచి పనిచేస్తున్నారు. వీరికి పీరియడ్ విధానంలో వేతనం చెల్లిస్తున్నారు. పీరియడ్ కు రూ.390 చొప్పున ఏడాది మొత్తం 72 పీరియడ్లను బోధిస్తారు. నెలకు వీరికి వచ్చే వేతనం రూ.28,080 మాత్రమే. పైగా వీరికి పది నెలల వేతనం మాత్రమే చెల్లిస్తారు.
ఇలా చాలీచాలని వేతనాలతో కాలేజీ ల్లో ప్రభుత్వ లెక్చరర్లతో సమానంగా విధు లు నిర్వర్తించడమే కాకుండా అకాడమిక్ పనులలోనూ కాలేజీలకు సహకరిస్తూ కాలేజీల అభివృద్ధికి పనిచేస్తున్నారు. వచ్చేవే అర కొర జీతాలు..పైగా వాటిని కూడా సమయానికి ఇవ్వకుంటే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు.
అంతేకాకుండా 2023 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో జూనియర్ కాలేజ్ గెస్ట్ లెక్చరర్లకు 12 నెలలకు గానూ నెలసరి వేతనం అమలు చేస్తూ.. నెలకు రూ.42వేల వేతనంతో పాటూ ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చింది. ప్రభు త్వం ఏర్పాటై 18 నెలలవుతున్నా ఇంతవరకూ హామీ అమలుకు నోచుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బడ్జెట్ విడుదల చేయని ఆర్థికశాఖ..
గత విద్యాసంవత్సరం నాలుగు నెలల పెండింగ్ వేతనాల ఫైల్ ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉందని గెస్ట్ అధ్యాపక సం ఘాల నేతలు చెబుతున్నారు. గతేడాది డిసెంబర్‌లోనే ఈ నాలుగు నెలలకు బడ్జెట్ కేటా యించాలని ఇంటర్ విద్యాశాఖ ఫైల్‌ను పం పించింది. కానీ ఇంతవరకూ బడ్జెట్‌ను విడుదల చేయలేదు. రెండు నెలలుగా ఆర్థిక శాఖ వద్ద ఫైల్ పెండింగ్‌లో ఉంది. దీనిపై అధికారులు, మంత్రులను కలిసినా ఫలితం లేకుం డా పోయిందని అధ్యాపకులు వాపోతున్నా రు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
రెన్యువల్ కాని ఉద్యోగాలు..
ప్రతీ సంవత్సరం మాదిరిగానే గత సంవత్సరం 1,654 మంది గెస్ట్ లెక్చరర్లను కంటిన్యూ చేశారు. కానీ 2024-25 విద్యా సంవత్సరంలో టీజీపీఎస్సీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా 1,256 రెగ్యులర్ లెక్చరర్లకు మార్చి నెలలో అపాయింట్ మెంట్స్ ఇవ్వడంతో కొత్తవారు విధుల్లో చేరారు. అయితే రెగ్యులర్ లెక్చరర్ల రాకతో గత 12 సంవత్సరాలుగా కాలేజీల్లో విధులు నిర్వర్తిస్తున్న గెస్ట్ లెక్చరర్లు ఉపాధి కోల్పోవాల్సి వస్తోంది.
ఈ సమస్యను అధికారుల దృష్టికి వారు తీసుకెళ్లడంతో 1,654 మందిలో 1,256 మంది పో నూ మిగిలిన వారికి మాత్రమే ఉద్యోగాలు రెన్యువల్ చేస్తామని అంటున్నారు. అయితే ఈ 1,654లో దాదాపు 580 మందిని ఈ నూతన విద్యాసంవత్సరం నుంచి విధుల్లో క ంటిన్యూ చేస్తున్నారు. కానీ మిగిలిన వారిని మాత్రం ఇంతవరకూ ఉద్యోగాల్లోకి తీసుకోలేదని గెస్ట్ అధ్యాపకులు చెబుతున్నారు.
అ ందరినీ తీసుకుంటామని ప్రభుత్వం తమకు హామీ ఇచ్చిందని, దానిప్రకారమే మిగిలిన 1,000 మందికిపైగా ఉన్న అందర్నీ రెన్యువ ల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పది, ప న్నెండేళ్ల నుంచి దీన్నే నమ్ముకొని ఉన్నామని, ఒకేసారి ఉద్యోగాల నుంచి తీసేస్తే తాము ఎ లా బతకాలని అధికారులను నిలదీస్తున్నా రు. రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా 18 జూనియర్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. విద్యార్థు ల సంఖ్య ఎక్కువగా ఉన్న కాలేజీల్లో పో స్టులు అదనంగా క్రియేట్ చేసి తమను స ర్దుబాటు చేయాలని కోరుతున్నారు.
పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి..
గత విద్యాసంవత్సరానికి సంబంధించి నాలుగు నెలల వేతనాలు ఇంతవరకూ పెండింగ్‌లోనే ఉన్నాయి. బడ్జెట్ ఫైల్‌ను గతేడాది డిసెంబర్‌లోనే పంపినప్పటికీ బడ్జెట్ విడుదల చేయలేదు. ఎనిమిది నెలల నుంచి జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. ఫైల్ గత రెండు నెలలుగా ఆర్థిక శాఖ వద్దనే పెండింగ్‌లో ఉంది.వెంటనే పెండింగ్ వేతనాలకు సంబంధించిన బడ్జెట్ విడుదల చేసి మాకు న్యాయం చేయాలి.
దార్ల భాస్కర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
తెలంగాణ గెస్ట్ ఫ్యాకల్టీ
ఉద్యోగాల్లోకి తీసుకోవాలి..
పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలి. ఈ విషయమై హైదరాబాద్‌కు వచ్చి ఉన్నతాధికారులను కలిసి అడుగుదామన్నా దారి ఖర్చులకు డబ్బులు లేవు. స్కూళ్లు ప్రారంభమయ్యాయి. పిల్లలకు పుస్తకాలు, ఫీజులు కట్టాల్సి ఉంది. ఇచ్చేవే అరకొర వేతనాలు వీటిని కూడా నెలల తరబడి ఆపడం సరైంది కాదు. అలాగే మమ్మల్ని ఉద్యోగాల్ల్లోకి తీసుకోవాలి. సీనియారిటీ వైజ్‌గా సర్దుబాటు చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకూ తీసుకోలేదు.
నాగశ్రీ, గెస్ట్ ఫ్యాకల్టీ,
గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ ఖమ్మం