calender_icon.png 30 July, 2025 | 2:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఆపరేషన్ సిందూర్’పై సమరం

30-07-2025 01:20:50 AM

  1. పార్లమెంట్‌లో అధికార, విపక్షం మధ్య మాటల యుద్ధం
  2. ఆపరేషన్ సిందూర్ ఆపాలని ఏ దేశాధినేత చెప్పలేదు: మోదీ

  3. బుల్లెట్‌కు బుల్లెట్‌తోనే సమాధానమిచ్చామిచ్చాం
  4. పాక్ డీజీఎంవో బతిమాలితే ఆపరేషన్ నిలిపేశాం: ప్రధాని
  5. ట్రంప్ అబద్ధాల కోరు అని మోదీ ఒప్పుకోవాలి: రాహుల్ గాంధీ
  6. పాక్ సైన్యం, ఎయిర్‌ఫోర్స్ మొత్తం చైనా చేతుల్లోనే
  7. బైసరన్ లోయ భద్రతను గాలికొదిలేశారా: ప్రియాంక 
  8. రాజ్యసభలో నడ్డా, ఖర్గే మధ్య మాటల యుద్ధం

న్యూఢిల్లీ, జూలై 29: పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌పై జరిగిన చర్చతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. అధి కార, ప్రతిపక్ష నేతల మధ్య మాటాల తూటాలతో అటు లోక్‌సభ, రాజ్యసభ అట్టుడి కాయి. మంగళవారం జరిగిన చర్చలో ఇరు సభల్లోనూ దిగ్గజ నేతల మధ్య పరస్పర మా టల యుద్ధం కొనసాగింది. ముఖ్యంగా ‘ఆపరేషన్ సిందూర్’ ఎందుకు ఆపారో చెప్పా లని..

కాల్పుల విరమణ వెనుక తన హస్తం ఉందని పదే పదే అమెరికా అధ్యక్షుడు ట్రం ప్ చెప్పడం వెనుక కేంద్రం ఉద్దేశం ఏమిటో చెప్పాలని ప్రతిపక్షాలు సభలో నిలదీశాయి. ఆపరేషన్ సిందూర్‌పై ప్రధాని మోదీ సుదీర్ఘంగా ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్ ఆపాలని ఏ దేశాధినేత తనకు చెప్పలేదన్నారు. ఆపరేషన్ విషయంలో తమకు 190 దేశాలు మద్దతిస్తే.. పాక్ వైపు మూడు దేశా లు నిలబడ్డాయని తెలిపారు. ఆపరేషన్ సిం దూర్ అయిపోలేదని.. పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడితే మళ్లీ ఆపరేషన్ నిర్వహి స్తామని హెచ్చరించారు. 

‘ఆపరేషన్ మహదేవ్’కు ముహూర్తం ఏమైనా చూడాలా అని ప్రతిపక్షాలనుద్దేశించి చురకలంటించారు. అంతకుముందు ఉదయం లోక్‌సభ ప్రారం భం కాగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. పహల్గాం అమానుష ఘటనకు సంబంధించి ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని అమిత్ షా ప్రకటించారు. అమిత్ షా ప్రసంగాన్ని లక్ష్యంగా చేసుకొని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ మాటల తూటాలు వదిలారు.

రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్టు ట్రంప్ 29 సార్లు చెప్పారని ఎంపీ రాహుల్ గాంధీ గుర్తుచేశారు. ఇది నిజం కాకపోతే ప్రధాని మోదీ ట్రంప్ వ్యాఖ్యలను పార్లమెంట్ సాక్షి గా తిరస్కరించాలన్నారు. మాజీ ప్రధాని ఇం దిరా గాంధీకి ఉన్న ధైర్యంలో కనీసం సగమయినా ఉంటే అన్ని విషయాలపై స్పష్టత ఇ వ్వాలని డిమాండ్ చేశారు. 

మోదీ ప్రభుత్వానికి పోరాడాలనే సంక ల్పం లేదని ఇది స్పష్టం చేస్తుందన్నారు. ఉగ్రదాడి జరిగిన బైసరన్ వ్యాలీకి వేలాది మంది పర్యాటకులు వస్తారని ప్రభుత్వానికి తెలియదా అని ఎంపీ ప్రియాంక గాంధీ ప్రశ్నిం చారు. కనీస భద్రత ఎందుకు ఏర్పాటు చే యలేదని.. దీనివల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అటు రాజ్యసభలోనూ ‘ఆపరేషన్ సిందూర్’, పహల్గాం ఉగ్రదాడి ఘటనపై ఆసక్తికర చర్చ జరిగింది.

దేశంలో ఉగ్రమూలాలు దెబ్బతీస్తే ఉగ్రవాదులు పహల్గాం వరకు వచ్చి ఎలా దాడి చేశారంటూ కాంగ్రె స్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మలికార్జున ఖర్గే ప్రశ్నిం చారు. పాకిస్థాన్‌కు విపక్షాలు మద్దతు ఇస్తున్నాయనడం దారుణమన్నారు. ప్రశ్న అడిగి తే పాక్ కు మద్దతు ఇస్తున్నట్టేనా అని ప్రశ్నించారు.

ఎన్‌కౌంటర్ నిన్ననే ఎందుకు?: అఖిలేష్

‘ఆపరేషన్ సిందూ ర్’ పేరిట మిలటరీ ఆ పరేషన్ విజయవంతంగా నిర్వహించి అక స్మాత్తుగా కాల్పుల విరమణ జరపడం వెనుక ఆంతర్యం ఏమి టన్నది అర్ధం కాలేదని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కేంద్రాన్ని నిలదీశారు. లోక్‌సభలో అఖిలేష్ మాట్లాడు తూ.. ‘ఆపరేషన్ మహదేవ్’లో ఉగ్రవాదులు హతమైనందుకు మాకు సంతోషమే.

కానీ దీనిని ప్రతిచోటా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుం టున్నది ఎవరు? మద్దతు అవసరమైనప్పుడు అన్ని రాజకీయ పార్టీలు మీతో కలిసి వచ్చాయి. మరో విషయం ఏం టంటే.. ఎన్‌కౌంటర్ నిన్ననే ఎందుకు జరిగింది? టెక్నాల జీ గురించి మీకు అంతగా తెలిసినప్పుడు పుల్వామాలో ఆర్డీఎక్స్‌ను తీసుకెళ్తున్న వాహనాన్ని ఇంతవరకు ఎందు కు పట్టుకోలేదు? ఇవాల్టికి బీజేపీ అనుకుం టే పుల్వామాకి ఏ మార్గం గుండా వాహనం వచ్చిందో తెలుసుకోగలరు. ఆపరేషన్ సిం దూర్ చేపట్టిన భారత ఆర్మీకి ప్రత్యేక ధన్యవాదాలు.

ప్రపంచంలోనే మన ఆర్మీ ముం దంజలో ఉంది. పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడటంతో పాటు వాళ్ల ఎయి ర్‌బేస్‌లను ధ్వంసం చేసింది. యుద్ధం కొనసాగిన తీరు చూసి వాళ్లను మెచ్చుకునే లో పే.. ప్రభుత్వం ఎందుకు ఆపరేషన్‌ను వెనక్కి లాగిందనేది తెలుసుకోవాలనుకుంటున్నాం.

లోతైన మిత్రత్వం కారణంగా ప్రభుత్వం వాళ్ల మిత్రుడిని కాల్పుల విరమణ ప్రకటన చేయమని అడిగింది’ అని ట్రంప్ తానే యుద్ధాన్ని ఆపానంటూ ప్రకటించుకోవడా న్ని అఖిలేష్ యాదవ్ పరోక్షంగా ప్రస్తావించారు.

‘ఆపరేషన్ సిందూర్’కు 190 దేశాల మద్దతు: మోదీ

ఆపరేషన్ సిందూర్ ఆపాలని ఏ దేశాధి నేత కూడా తమకు చెప్పలేదని.. మన సైన్యం చూపించిన తెగువకు పాక్ కాళ్ల బేరానికి వచ్చిందని, స్వయంగా ఆ దేశ డీజీఎంవో ఫోన్ చేసి యుద్ధం ఆపాలని వేడుకున్నారని ప్రధాని నరేంద్ర మో దీ వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో జరిగిన చర్చలో పాల్గొన్న మోదీ మాట్లాడుతూ.. ‘ఆపరేషన్ సిందూర్‌ను ప్రపంచంలోని 193 దేశాల్లో 190 దేశాలు సమర్థించాయి.

పాక్‌కు కేవలం మూడు దేశాలే అండగా నిలిచాయి. ఆపరేషన్ సిందూర్ ఆపాలని ప్రపంచం లో ఏ నేత కూడా మాకు చెప్పలేదు. మే 9న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాతో ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఆయన మూడు, నాలుగుసార్లు ఫోన్ చేశారు. ఆ సమయంలో నేను ఒక సమావేశంలో బిజీగా ఉన్నాను. ఆ తర్వాత తిరిగి వాన్స్‌కు ఫోన్ చేయగా..  పాక్ భారీగా దాడి చేయబోతుందని ఆయన హెచ్చరించారు.

అయితే పాక్ దీనికి భారీ మూల్యం చెల్లించుకుంటుందని వాన్స్‌కు చెప్పా. పాక్‌కు ఎవరు సాయం చేసినా..చూస్తూ ఊరుకునేది లేదని చెప్పాం. పాక్ ఎలాంటి దాడి చేసినా మేం చూసుకుంటామని వాన్స్‌కు చెప్పాను. బుల్లెట్‌కు బుల్లెట్‌తోనే సమాధానం చెప్తామని వాన్స్‌కు స్పష్టం చేశాం. పాక్ డీజీఎం అర్ధరాత్రి ఫోన్ చేసి దాడులు ఆపాలని బతిమాలితేనే ఆపరేషన్ సిందూర్ నిలిపివేశాం.

ఆపరేషన్ సిందూర్‌ను కాంగ్రెస్ మాత్రమే తప్పు పడుతోంది. స్వార్థ రాజకీయాల కోసం సైనికుల పరాక్రమాలను తక్కువ చేసి చూ స్తోంది. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు పాకిస్థాన్‌కు అధికార ప్రతినిధులుగా పనిచే శారు. పాక్ కోసం కాంగ్రెస్ దిగజారి రాజకీయం చేస్తోంది. కాంగ్రెస్‌ను చూసి దేశం మొత్తం నవ్వుతోంది. సైన్యం పట్ల కాంగ్రెస్ వైఖరి మొదటి నుంచి ప్రతికూలంగా ఉంది.

మన దగ్గర ఆధారాలు లేకపోయుంటే కాంగ్రెస్ ఇంకా ఏం చేసి ఉండే దో. ఆపరేషన్ సిందూర్ అప్పుడే ముగియలేదు. పాకిస్థాన్ మళ్లీ దుస్సాహసం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. స్వావలంబనతో భారత్ నేడు ముందుకు పోతుంది. మతాల మధ్య చిచ్చు పెట్టేందుకే పహల్గాం దాడులు. ఈ దాడి తర్వాత ఉగ్రవాదులను మట్టిలో కలుపుతామని ప్రతిజ్ఞ చేశాం. ద్రోహులకు కలలో కూడా ఊహించని విధంగా శిక్షిస్తామని చెప్పాం. ఉగ్రవాదులకు గట్టి గుణపాఠం చెప్పాలని అఖిలపక్ష భేటీలోనూ చర్చించాం. పాక్ భూభాగంలోకి వెళ్లి వాళ్ల ఉగ్రస్థావరాల్ని ధ్వంసం చేశాం.

పాక్ ఎయిర్‌బేస్‌లు ఇప్పటికీ ఐసీయూలోనే ఉన్నాయి. అణుబాం బులు బెదిరింపులు చెల్లవని పాక్‌ను హెచ్చరించాం. ఆపరేషన్ సిందూర్ సమయంలో మేము ఏదైతే నిర్ణయించామో దానిని వంద శాతం పూర్తి చేశాం. ఉగ్రవాదులను మట్టిలోకలిపినందుకు భారత్ విజయోత్సవాలు చేసుకుంటుంది. భారత సేనల శౌర్య, ప్రతాపాల ప్రదర్శన తర్వాత 140 కోట్ల భారతీయుల ఐక్యత, ఇచ్ఛాశక్తి ఫలాలతో భారత్  విజయోత్సవాలు చేసుకుంటోంది. భారత రక్షణ దళాల శక్తి, సామర్థ్యాలపై పూర్తి విశ్వాసం ఉంది. భారత్ రక్షణ దళాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చాం.

‘ఆపరేషన్ మహదేవ్’కు ము హూర్తం చూడాల్సిన అవసరం ఉంటుం దా? నిన్ననే ఎందుకు కాల్చారంటూ విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఉగ్రవాదుల్ని హతం చేయడానికి తేదీలు, వారాలు చూ డాలా?’ అని ప్రశ్నించారు. భారత రక్షణ పరిశ్రమల్లో సంస్కరణలు తీసుకొచ్చాం. రక్షణ రం గంలో ప్రైవేటు పరిశ్రమలకు తలుపులు తెరిచాం. గతంలో పోలిస్తే రక్షణ బడ్జెట్ మూడింతలు పెరిగింది. భారత రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు 30 రెట్లు పెరిగాయి. భారత్ యుద్ధ దేశం కాదు.. బుద్ధ దేశం’ అని మోదీ వెల్లడించారు.

ఆ ముగ్గురు పహల్గాం ఉగ్రవాదులే: అమిత్ షా

ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో జరిగిన చర్చలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ‘పహల్గాం ఘటన అమానుషం. మతం పేరు అడిగి మరీ పర్యాటకులను చంపారు. ఆ దాడి జరిగిన ప్రాంతానికి నేను వెంటనే వెళ్లాను. నిన్న ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది హతమార్చారు. ఆ ముగ్గురు పహల్గాం ఉగ్రదాడితో సంబంధమున్నవారే. పహల్గాం దాడి కీలక సూత్రధారి సులేమాన్ హతమయ్యాడు.

ఉగ్రవాదులను ఆశ్రయం ఇచ్చినవారిని ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుంది. దాడిలో దొరికిన తుపాకీ, బుల్లెట్లను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపాం. ఉగ్రవాదులు పాక్ నుంచే వచ్చారనేందుకు ఆధారాలున్నాయా? అని కాంగ్రెస్ నేత చిదంబరం ప్రశ్నించారు. ఒక కేంద్ర హోంమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు.

ఉగ్రవాదులు పాక్  నుంచే వచ్చారనేందుకు మా వద్ద ఆధారాలున్నాయి. వారి నుంచి పాక్‌లో తయారైన పత్రాలు, చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నాం. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా త్రివిధ దళాలు చూపించిన తెగువకు పాక్ సరెండర్ అయింది’ అని పార్లమెంట్ వేదికగా స్పష్టం చేశారు.

జేపీ నడ్డా వర్సెస్ ఖర్గే

ఆపరేషన్ సిందూర్‌పై రాజ్యసభలోనూ వాడీవేడి చర్చ జరిగింది. ఈ క్రమంలో రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, కేంద్ర మంత్రి జేపీ నడ్డా మధ్య మాటల యుద్ధం జరిగింది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌పై ఖర్గే దాదాపు గంటపాటు ప్రసంగించారు. ఈ క్రమంలో ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ ఖర్గే బీజేపీని ‘గద్దార్ (దేశద్రోహులు)’ అని పిలిచారు. దీనిని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తీవ్రంగా ఖండించారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు ‘మెంటల్ బ్యాలెన్స్’ కోల్పోతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీపై ఖర్గే చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. నడ్డా చర్యలను తీవ్రంగా తప్పుబట్టిన విపక్షాలు క్షమాపణ చెప్పాలంటూ బల్లలు చరుస్తూ ఆందోళన చేపట్టాయి. అనంతరం ఖర్గే మాట్లాడుతూ.. ఎన్డీయే ప్రభుత్వంలో తాను గౌరవించే మంత్రుల్లో నడ్డా ఒకరని.. అయినా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం శోచనీయమన్నారు. క్షమాపణలు చెప్పాలని కోరగా.. వెంటనే నడ్డా స్పందిస్తూ.. ఇప్పటికే తన మాటలు వెనక్కి తీసుకున్నానని.. క్షమాపణ కూడా చెప్పానని తెలిపారు. దీంతో వివాదం సద్దుమణిగింది.

మన సైనికుల చేతులు కట్టేశారు: రాహుల్ గాంధీ

ఆపరేషన్ సిందూర్ సమయంలో మన సైనికులు చేతులు కట్టేశారని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. లోక్‌సభలో రాహుల్ మాట్లాడుతూ.. ‘సాయుధ దళాలలను ఉపయోగించాల నుకుంటే బలమైన రాజకీయ సంకల్పం ఉండాలి. వారికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలి. కానీ ఆపరేషన్ సిందూర్ విషయంలో మన సైనికులు చేతులు కట్టేశారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన సున్నితమైన వివరాలు దాయాదికి వెల్లడించారు.

పాక్ విజ్ఞప్తి మేరకు యుద్ధాన్ని ఆపామని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు భారత్, పాక్ యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటివరకు 29సార్లు చెప్పుకొన్నారు. మాజీ ప్రధాని ఇందిలా గాంధీలా ధైర్యం ఉంటే.. ట్రంప్ ‘అబద్ధాల కోరు’ అని మోదీ ఒప్పుకోవాలి.  యుద్ధం చేసే రాజకీయ సంకల్పం ప్రభుత్వానికి లేదని.. రక్షణ మంత్రి మాటలతో తేటతెల్లం అవుతోంది.

కేవలం తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే మోదీ ‘ఆపరేషన్ సిందూర్’ అనే బ్రాండ్ వాడుకున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయాల వల్లే మన యుద్ధ విమానాలు కూలాయి. ఉగ్రదాడి తర్వాత ఒక్క దేశం కూడా పాక్‌కు ఖండించలేదు. ప్రపంచ దేశాలు మాత్రమే ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించాయి. పాక్ సైన్యం, ఎయిర్‌ఫోర్స్ చైనాతో ముడిపడి ఉంది.

కీలక సమాచారమంతా పాక్‌కు చైనా చేరవేసింది. యుద్ధంపై విదేశాంగ మంత్రికి కనీస పరిజ్ఞానం లేదు. అందుకే సైనిక పరంగా చైనా, పాక్ కలిసిపోయాయి. పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు నిర్దయగా అమాయకులను చంపేశారు. పాక్ దుశ్చర్యను సభలో ప్రతి ఒక్కరు ఖండించారు.  ప్రతిపక్షంగా ఐక్యంగా ఉన్నందుకు గర్వపడుతున్నాం. 

ట్రంప్ వ్యాఖ్యలను మోదీ ఎందుకు ఖండించలేదు?: ఖర్గే

ఆపరేషన్ సిందూర్‌పై రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ కేంద్రానికి కొన్ని ప్రశ్నలు సంధించారు. ఆయన మాట్లాడుతూ.. ‘బీజేపీ ప్రభుత్వ హయాంలో పహల్గామ్‌లో ఐదుసార్లు దాడులు జరిగాయి. అయినా ఈ అంశంపై బీజేపీ గుణపాఠం నేర్చుకోలేదు. నిన్న ముగ్గురు ఉగ్రవాదులను చంపినట్టు తెలిపారు. మిగిలిన వాళ్లను ఎప్పుడు కనుగొంటారో చెప్పండి.

ఆపరేషన్ సిందూర్ అంశంపై మేము సీడబ్ల్యూసీ సమావేశంలో ఒక తీర్మానం ఆమోదించాం. సైన్యాన్ని గౌరవిస్తూ జైహింద్ యాత్ర చేపట్టాం. రాజకీయాలు చేయడానికి ఇది సమయం కాదని నిర్ణయించుకొని ప్రభుత్వానికి మద్దతుగా నిలబడ్డాం. కానీ మోదీ మాత్రం ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ప్రసంగాలు చేశారు. భారత సైన్యం పాక్‌పై బలంగా దాడి చేసింది. అయితే అకస్మాత్తుగా కాల్పుల విరమణ ప్రకటించారు.

ఈ ప్రకటన ఎవరు,ఎక్కడి నుంచి చేశారన్నది ప్రశ్న. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాషింగ్టన్ నుంచి కాల్పుల విరమణ ప్రకటించారు. తాను యుద్ధాన్ని ఆపానని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ ప్రకటనపై మోదీ ఎందుకు మౌనంగా ఉనారో చెప్పాలి. భారత్‌కు చెందిన ఐదు జెట్ విమానాలు కూల్చివేసినట్టు ట్రంప్ అన్నారు. కానీ ఒక్క జెట్ కూడా నేలమట్టం కాలేదని మోదీ చెబితే దేశ ప్రజలు వినాలనుకుంటున్నారు’ అని ఖర్గే పేర్కొన్నారు.

బైసరన్ లోయలో భద్రతను గాలికొదిలేశారా?: ప్రియాంక గాంధీ

భారత్ మధ్య కాల్పుల విరమణ ప్రకటనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేయడం మన ప్రధాన మంత్రి బాధ్యతారాహిత్యాన్ని ప్రతిబింబిస్తోందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. లోక్‌సభలో ఆమె మాట్లాడుతూ.. ‘నెహ్రూ, ఇందిరా గాంధీ విషయాలతో పాటు నా తల్లి సోనియా కన్నీరు పెట్టిన విషయంపై అమిత్ షా మాట్లాడారు. కానీ శత్రువులు ఎక్కడికీ వెళ్లలేని సమయంలో యుద్ధాన్ని ఎందుకు ఆపారో అమిత్ షా సమాధానం చెప్పలేదు.

ఆకస్మికంగా యుద్ధాన్ని ఆపడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. బైసరన్ వ్యాలీకి వేలాది మంది పర్యాటకులు వస్తారని ప్రభుత్వానికి తెలియదా. భద్రత ఎందుకు లేదు. భద్రతను గాలికొదిలేశారా?. ఇంత దారుణమైన ఉగ్రదాడి జరగనుందని..

ఇందుకు పాక్ కుట్ర పన్నుతుందని ప్రభుత్వ ఏజెన్సీలు ముందుగానే ఎందుకు పసిగట్టలేకపోయాయి? ఇది మన ప్రభుత్వం, నిఘా సంస్థల వైఫల్యమే. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఎవరైనా రాజీనామా చేశారా? గతం గురించి మాట్లాడుతారు కానీ ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలపై మాత్రం సమాధానం చెప్పరు’ అని ప్రియాంక ధ్వజమెత్తారు.