27-07-2025 12:00:00 AM
భారతదేశంలో హెపటైటిస్ ఒక పెరుగుతున్న ప్రజారోగ్య సమస్య. సుమారు 40 మిలియన్ల మంది దీర్ఘకాలిక ‘హెపటైటిస్ బి’తో జీవిస్తున్నారు, 12 మిలియన్ల మంది ‘హెపటైటిస్ సి’ తో బాధపడుతున్నారు. ఇది నివారించదగినదిగా, చికిత్స చేయదగినదిగా ఉన్నప్పటికీ, ఈ వ్యాధి నిశ్శబ్దంగా జీవితాలను దెబ్బతీస్తూనే ఉంది. తీవ్ర సమస్యలు తలెత్తే వరకూ ఇది గుర్తించబడదు.
మనం సరైన దిశలో నడుస్తున్నామా?
వైద్య పురోగతికి కేంద్రంగా ఉన్న హైదరాబాద్ కూడా ఈ సంక్షోభం నుంచి తప్పించుకోలేకపోయింది. నగరంలోని లివర్ నిపుణులు హెపటైటిస్‌కు సంబంధించిన కేసులలో స్థిరమైన పెరుగుదలని గుర్తిస్తున్నారు. అవగాహ న లేకపోవడం లేదా సాధారణ స్క్రీనింగ్ చెయ్యకపోవడం వలన చాలామందికి ఆలస్యంగా రోగనిర్ధారణ జరుగుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇప్పటికే కలిగివున్న శక్తివంతమైన సాధనాలు టీకాలు, ముందస్తు పరీక్షలు, సమర్థవంతమైన చికిత్సలు మిగిలిన దేశాల్లోనూ అందుబాటులో ఉండటంతో, ఈ వ్యాధి వ్యాప్తి ఇంకా ఆందోళనకరంగా మారుతోంది.
ఛేదిద్దాం
హెపటైటిస్: ‘దీన్ని ఛేదిద్దాం’ అనే థీమ్‌తో 2025లో జరుపుకుంటున్న ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం, అజ్ఞానం, వివక్ష, అందుబాటు లోపం వంటి అడ్డంకులను అధిగమించి, నివారణ, విద్య, ముందస్తు జోక్యంపై దృష్టి పెట్టాలని పిలుపునిస్తుంది.
హెపటైటిస్ అంటే ఏమిటి?
హెపటైటిస్ అనేది కాలేయ వాపు. ఇది సాధారణంగా వైరస్‌ల వల్ల వస్తుంది. అయితే మద్యం, మందులు, లేదా రోగనిరోధక వ్యవస్థ దాడి చేయడం వంటివి కూడా కారణాలు కావచ్చు. ఇది చికిత్స లేకుండా వదిలేస్తే, కాలేయాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తూ, చివరికి కాలేయ వైఫల్యం లేదా కాలేయ క్యాన్సర్‌కు దారితీస్తుంది.
హెపటైటిస్ కారణాలు:
1.వైరల్ హెపటైటిస్ ఐదు ప్రధాన రకాల వైరస్‌లు
A, B, C, D, E.
‘A, E: కలుషిత ఆహారం లేదా నీటివల్ల
‘B, C: రక్తం మరియు శరీర ద్రవాల ద్వారా
‘D: హెపటైటిస్ B ఉన్నవారికి మాత్రమే వస్తుంది
2.ఆల్కహాలిక్ హెపటైటిస్
అధిక మోతాదులో మద్యం వల్ల కాలేయ కణాలు దెబ్బతింటాయి. దీర్ఘకాలంలో సిర్రోసిస్కి దారితీస్తుంది.
3.నాన్-ఆల్కహాలిక్ స్టీటో హెపటైటిస్ (NASH)
ఆల్కహాల్ తీసుకోని వారిలో ఎక్కువ బరువు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారిలో తరచూ కనిపిస్తుంది.
4.ఆటోఇమ్యూన్ హెపటైటిస్
రోగనిరోధక వ్యవస్థ పొరపాటుగా కాలేయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తుంది. మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
5.డ్రగ్-ఇండ్యూస్డ్ హెపటైటిస్
కొన్ని మందులు మరియు ఆయుర్వేద సప్లిమెంట్లు కాలేయంపై విష ప్రభావం చూపుతాయి (ఉదా: అధిక డోసు పారాసెటమాల్, TB మందులు, LIV52 మొదలైనవి).
లక్షణాలు:
అలసట,‘వికారం, ఆకలి లేకపోవడం, ముదురు మూత్రం, పసుపు రంగు చర్మం/కళ్లు (జండీస్), పొత్తికడుపు నొప్పి, జాయిం ట్ నొప్పులు (చాలామంది దీర్ఘకాలిక దశల వరకు ఎలాంటి లక్షణాలు అనుభవించకపోవచ్చు) ఎందుకు ఈ రోజు ముఖ్యమైంది?
ప్రతి సంవత్సరం >10 లక్షల మంది హెపటైటిస్ వల్ల మరణిస్తున్నారు.
ఇప్పటికే మన వద్ద:
వేగవంతమైన పరీక్షలు, హెపటైటిస్ A & Bకి టీకాలు, హెపటైటిస్ B & Cకి చికిత్సలు ఉన్నాయి. అయితే అవగాహన లోపం, అపోహలు, భయం ఇవే పెద్ద అడ్డంకులు. అందుకే ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం కీలకం.
ఎవరు ప్రమాదంలో ఉన్నారు?
వైరల్ హెపటైటిస్ ఎక్కువగా వచ్చే పరిస్థితులు సూదులు, రేజర్లు పంచుకోవడం, అసురక్షిత లైంగిక చర్య, ఆసుపత్రుల్లో పని, అపరిశుభ్ర ప్రదేశాల్లో పచ్చబొట్లు/కుట్లు, డయాలసిస్పు ఉండే రోగులు, ఎన్‌ఏఎస్‌హెచ్ అధిక బరువు, మధుమేహం, కొలెస్ట్రాల్ ఉన్నవారు, ఏఐహెచ్ మహిళలు, ఆటోఇమ్యూన్ రోగాల కుటుంబ చరిత్ర ఉన్నవారు, డీఐఎల్‌ఐ, ఎల్‌ఐవీV52, పారాసెటమాల్, స్టెరాయిడ్లు వాడేవారు.
నివారణ మార్గాలు:
హెపటైటిస్ A & B టీకాలు వేయించుకోవాలి, వ్యక్తిగత వస్తువులు పంచుకోవద్దు, చేతులు తరచూ కడుక్కోవాలి, పచ్చబొట్లు/కుట్లు వేయించుకునే చోట పరిశుభ్రత ఉండాలి, ఆల్కహాల్ మానుకోవాలి, బరువు తగ్గాలి, షుగర్ నియంత్రణలో ఉంచాలి. ఆధ్యాత్మిక/హెర్బల్ మందులు తీసుకునేముందు హెపటాలజిస్ట్ను సంప్రదించాలి.
స్టార్ హాస్పిటల్స్ సేవలు:
స్టార్ హాస్పిటల్స్లో మేము హెపటైటిస్పు సమగ్ర సంరక్షణ అందిస్తున్నాము.
అత్యాధునిక యాంటీవైరల్ థెరపీలు, నాన్-ఇన్వేసివ్ లివర్ టెస్టులు, డీ-అడిక్షన్ ప్రోగ్రామ్‌లు, కాలేయ మార్పిడి సేవలు, మల్టీడిసిప్లినరీ టీమ్ మద్దతు, హై-ఎండ్ ఇమేజింగ్, యాగ్నస్టిక్స్
ముగింపు:హెపటైటిస్ నివారించదగిన వ్యాధి.
అవగాహనే మొదటి ఆయుధం. ఈ ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా, తెలియని విషయాలను తెలుసుకుందాం, అపోహలను తొలగించుకుందాం, ఆరోగ్య సంరక్షణ అందరికీ చేరేలా చూసేద్దాం.