calender_icon.png 20 September, 2025 | 5:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హీరోయిన్ సదాకు పితృవియోగం

20-09-2025 12:25:10 AM

హీరోయిన్ సదా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి సయ్యద్ మరణించారు. వారం క్రితమే ఆయన చనిపోయినప్పటికీ ఈ విషయాన్ని సదా తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.  ‘నాన్న చనిపోయి వారం రోజులు గడిచింది. కానీ, ఓ యుగంలా అనిపిస్తుంది. సినిమా ఇండస్ట్రీ అమ్మాయిలకు సేఫ్ కాదు అనే రోజుల్లో కుటుంబాన్ని ఎదిరించి నాకు అండగా నిలిచారు నాన్న. నా షూటింగ్‌ల వల్ల నాన్న ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. కొన్నేళ్లపాటు నాతో షూటింగ్స్‌కి వచ్చారు.

ఆ తర్వాత కొంతకాలానికి నాన్న ఓ చిన్న క్లినిక్ మొదలుపెట్టారు. ఎంతో మంది మనుషులకు, జంతువులకు వైద్యం చేశారు. ఆయనకు కూతురు కావడం నాకు గర్వకారణం. నిజంగా ఆయనొక వెలకట్టలేని మనిషి. మిస్ యూ నాన్నా’ అంటూ ఎమోషనల్‌గా సుదీర్ఘమైన పోస్ట్ పెట్టింది సదా. ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. స్నేహితులు, బంధువులు, వివిధ రంగాల ప్రముఖులు సానుభూతి వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.