calender_icon.png 20 September, 2025 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అస్సామీ గాయకుడు హఠాన్మరణం

20-09-2025 12:26:59 AM

ప్రముఖ అస్సామీ సింగ ర్ జూబిన్ గార్గ్ (52) హఠాన్మరణం చెందారు. సింగ పూర్‌లో జరిగిన స్కూబా డైవింగ్ ప్రమాదంలో తీవ్రం గా గాయ పడిన ఆయన్ను పోలీసులు సముద్రం నుంచి వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ గార్గ్ ప్రాణాలు విడిచారు. జూబిన్ గార్గ్ ఉత్తర తూర్పు ఉత్సవంలో పాల్గొనడానికి సింగపూర్ వెళ్లారు. ప్రమాదం జరిగిన రోజు ఆయన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది.

మూడేళ్ల వయసులోనే గాత్ర కళా ప్రదర్శన ప్రారంభించిన ఆయన బాలీవుడ్‌లో ప్రముఖ గాయకుడిగా ఎదిగారు. అనేక మరుపురాని పాటలతో సంగీత ప్రియుల హృదయాలను గెలుచుకున్నారు. వాటిలో ‘గ్యాంగ్‌స్టర్’ చిత్రంలోని ‘యా అలీ’ పాట ముఖ్యమైంది. అస్సామీ, బెంగాళీ, హిందీ చిత్ర పాటలతోపాటు 40కి పైగా భాషలు, మాండలికాల్లో పాటలు పాడారు. జూబిన్ 12 వాద్యపరికరాలు వాయించగలరు. 2011లో చికాగోలో నిర్వహించిన అస్సాం కన్వెన్షన్‌లో గెస్ట్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కారం అందుకున్నారు.