calender_icon.png 19 September, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్కి సీక్వెల్ నుంచి దీపిక ఔట్

19-09-2025 12:57:30 AM

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ చిత్రంలో దీపికా పదుకొణె సుమతి అనే కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించే పనుల్లో చిత్రబృందం నిమగ్నమైంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే, ‘కల్కి పార్ట్2’లో దీపిక నటించడం లేదు.

ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించింది. “జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే మేం ఒక నిర్ణయానికి వచ్చాం. కల్కి సీక్వెల్‌లో దీపిక భాగం కాదని అధికారికంగా తెలియజేస్తున్నాం. తొలిభాగం కోసం ఆమెతో సుదీర్ఘ ప్రయాణం చేసినప్పటికీ రెండో భాగంలో భాగస్వామి కాలేకపోయింది. గొప్ప టీమ్‌తో కల్కి సీక్వెల్ మీ ముందుకు వస్తుంది. దీపిక భవిష్యత్తులో మంచి సినిమాలతో అలరించాలని కోరుకుంటున్నాం” అని పోస్ట్ పెట్టారు. ఇదిలా ఉంటే, కొన్నిరోజుల క్రితం కూడా దీపిక పదుకొణె ప్రభాస్, సందీప్‌రెడ్డి వంగా ‘స్పిరిట్ నుంచి’ కూడా తప్పుకున్న సంగతి తెలిసిందే.

ఆమె స్థానంలో త్రిప్తిడిమ్రీని కథానాయిక చిత్రబృందం తీసుకుంది. ఓ బిడ్డకు తల్లి అయిన తర్వాత దీపిక.. రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తానని అనడం, ఎక్కువ పారితోషికం అడగడంతో సందీప్.. దీపికను తప్పించాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ‘కల్కి’ ప్రాజెక్టు నుంచి దీపిక వైదొలగడం చర్చనీయాంశమైంది. తొలిభాగంగలో సుమతి పాత్రలో దీపిక మెప్పించింది. ఇప్పుడు ఆమె స్థానంలో సీక్వెల్‌లో ఎవరు నటిస్తారనే విషయమై చిత్రపరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.