సీపీఎస్ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
- ఎల్‌బీ స్టేడియంలో సభకు అనుమతి
- రేపు జరిగే సభకు వేలాదిగా తరలిరావాలని స్థితప్రజ్ఞ పిలుపు
హైదరాబాద్, ఆగస్టు 21 (విజయక్రాం తి): తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్ సీపీఎస్‌ఈయూ) ఆధ్వర్యంలో ఈ నెల 23న తలపెట్టిన ‘చలో హైదరాబాద్’ సీపీఎస్ భారీ బహిరంగ సభకు హైకోర్టు అనుమతి మం జూరు చేసినట్లు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ తెలిపారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన ఈ సభకు పోలీసులు అనుమతి నివ్వకపోవడంతో, యూనియన్ తరపున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వాల శ్రీకాంత్ లంచ్ మోషన్ పిటిషన్‌ను పిటిషనర్ న్యాయవాది రోహన్ ఆలూర్ దాఖలు చేయగా, సీనియర్ న్యాయవాది ఆలూర్ గిరిధర్ రావు వాదనలు వినిపించారు.
ప్రభుత్వ న్యాయవాది వాదనలను కూడా పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఈ మేరకు సభకు అనుమతిస్తూ శుక్రవారం ప్రకటించారు. న్యాయ వాది గిరిధర్ రావు కోర్టులో బలమైన వాదనలు వినిపిస్తూ, ఉద్యోగుల హక్కులను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేస్తూ... ప్రభుత్వ ఉద్యోగులు,
ఉపాధ్యాయులు సర్వీస్ కాండక్ట్ రూల్స్‌కు లోబడే విధులు నిర్వహిస్తారని, శాంతియుతంగా తమ సమస్యలను చెప్పుకునే హక్కు వారికి ఉందని, యూనిఫామ్ సర్వీసులైన పోలీసు శాఖ కూడా ఇందులో భాగమేనని సభకు అనుమతులు జారీ చేసినట్లు తెలిపారు. న్యాయస్థానం కల్పించిన ఈ అవకాశంతో 23న ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ మహాసభకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కంట్రిబ్యూటరీ పెన్షన్ విధాన ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ భారీ సంఖ్యలో తరలిరావాలని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ పిలుపునిచ్చారు.






