ప్రశ్నించలేని దద్దమ్మలు జిల్లా మంత్రులు
- పోతిరెడ్డిపాడు ద్వారా 148 టీఎంసీల నీటి దోపిడీ
- సాగర్ నీటి తరలింపుపై జగదీష్ రెడ్డి హెచ్చరిక
నల్లగొండ, ఆగస్టు 21 (విజయక్రాంతి): నాగార్జునసాగర్ నీళ్లను ఆంధ్రప్రదేశ్ యథే చ్ఛగా దోచుకుపోతున్నా ప్రశ్నించలేని దద్ద మ్మలు జిల్లా మంత్రులు అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రంగా విరుచుకు పడ్డారు. స్థానిక పార్టీ కార్యాలయ ంలో శుక్ర వారం నిర్వహించిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడారు. శ్రీశైలం నీరు దోపిడీ జరుగుతోందని, జిల్లాలోని ఇద్దరు మంత్రులు అడ్డుకొనే ప్రయత్నం చేయక పో వడంతో వ్యవసాయం ఆగమవుతోందని ఆ రోపించారు.
కేసీఆర్ ఉన్నన్ని రోజులు ఆంధ్ర వాళ్ల ఆటలు సాగనివ్వ లేదని, సాగర్ ఓవర్ ఫ్లో అయి సముద్రంలో నీళ్లు వదిలి నప్పుడే పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తీసుకో వాలని నిబంధన స్పష్టంగా ఉందని గుర్తు చేశారు. సాగర్ నీటిని సమగ్రంగా విడుదల చేసింది కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు. వెంట నే ఎడమ కాల్వ కు, లిఫ్ట్‌లకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే బీఆర్‌ఎస్ పెద్ద ఎత్తున పోరాటానికి దిగు తుందని జగదీష్ రెడ్డి హెచ్చరించారు. ఎమ్మెల్సీ కోటిరెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, భాస్కరరావు, బీ ఆర్ ఎస్ నాయకులు కృష్ణారెడ్డి, బొమ్మర బోయిన నాగార్జున తదితరులు పాల్గొన్నారు.






