calender_icon.png 10 May, 2025 | 8:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు అండగా బీఆర్ఎస్

10-05-2025 04:21:18 PM

  1. గోపాల్ పేట లో రైతుల రాస్తా రోకో..
  2. ధాన్యం తరలించడంలో ప్రభుత్వం విఫలం 
  3. గంటపాటు నిలిచిపోయిన వాహనాలు 
  4. ఇబ్బందుల్లో ప్రయాణికులు 

గోపాలపేట: రాష్ట్రంలోని రైతులకు అండగా బీఆర్ఎస్ నిలుస్తుందని రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతుందని బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం గోపాలపేట మండల కేంద్రంలో రైతు లు గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి ప్రయాణం రమ్మీ గా మారింది. వనపర్తి జిల్లా గోపాలపేట మండలం లో రైతులు చేసి పండించిన గింజలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యపు సంచులను ప్రభుత్వం తీసుకెళ్లకుండా కేంద్రాల ముందే ఏర్పాటు చేశారు. ఎవరి ధాన్యానికి వారే కాపల ఉండాల్సి వస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని సరఫరా చేయడంలో విఫలమైందని రైతులు మండిపడ్డారు. గత ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఎప్పటికప్పుడే మిల్లర్లకు సరఫరా చేసేది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎందుకు సరఫరా చేయడం లేదు అంతర్యంగా ఉందని రైతులు వాపోతున్నారు. లారీలను సరఫరా చేయకపోవడం పట్ల కొన్ని కేంద్రాలలో దాన్య బస్తాలు చదలు పట్టి ఉన్నాయని అన్నారు వర్షం వస్తే ధాన్యపు బస్తాలంట నాని మొలకెత్తుతున్నాయని తెలిపారు.

రైతు యొక్క వరి ధాన్యం కాంట చేసిన తర్వాత ధాన్యం తరలించడంలో ప్రభుత్వ అసమర్ధతను నిరసిస్తూ, అలాగే తరుగు తీయకూడదని అన్నారు. గోపాల్ పేట ప్రధాన రహదారిపై రైతులు గంట పాటు రాస్తారోకో నిర్వహించడం జరిగింది. సంబంధిత అధికారులు వచ్చి హామీ ఇచ్చేవరకు రాస్తారోకో విరమించమని రైతులు నాయకులు బీష్మించి కూర్చున్నారు. వెంటనే, సివిల్ సప్లై జిల్లా అధికారి విశ్వనాథం రైతుల దగ్గరికి వచ్చి ప్రతిరోజు నాలుగు లారీలను గోపాల్ పేట గ్రామంలోని ధాన్యం బస్తాలు సేకరణకు పంపుతానని హామీ ఇవ్వడంతో రాస్తారోకోను విరమించడం  కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు రైతులు ఉన్నారు.