calender_icon.png 10 May, 2025 | 9:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్ది రామచందర్ వర్ధంతి

10-05-2025 04:23:22 PM

నిర్మల్, (విజయక్రాంతి): ఆదివాసి ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివాసి ఉద్యమ నేత స్వర్గీయ మద్ది రామచంద్ర ప్రథమ వర్ధంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఆయన చేసిన సేవలను పలువురు నాయకులు కొనియాడారు.జ ఉద్యోగ సంఘం అధ్యక్షులు రవికుమార్ రామచందర్ జీవిత విశేషాలు తెలిపారు.

ప్రధాన కార్యదర్శి అనుగొండ సత్యనారాయణ మాట్లాడుతూ, “రామచందర్ గారు ఆదివాసుల హక్కుల కోసం తన జీవితాన్ని అర్పించిన మహాత్ముడు. ఆయన చూపిన మార్గంలోనే మనమూ నడవాలి,” అని పేర్కొన్నారు. కోశాధికారి గుండంపల్లి సాయన్న మాట్లాడుతూ, “ఆయన పోరాటం వల్లే ప్రభుత్వ విధానాల్లో మార్పులు వచ్చాయి. యువతరం ఆయన ఆశయాలను అనుసరించాలి,” అని తెలిపారు. సంఘ సభ్యులు దాసరి రమేష్, కస్తూరి భీమేశ్వర్, కాల శంకర్, చుంచు పోశెట్టి, అర్జున్ లింగన్న, సూరిళ్ల బాపయ తదితరులు పాల్గొన్నారు