calender_icon.png 10 May, 2025 | 9:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనర్లకు వాహనాలు ఇచ్చిన తండ్రులపై కేస నమోదు: ఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి

10-05-2025 05:07:26 PM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): మైనర్లకు వాహనాలు ఇచ్చిన ఇద్దరు తండ్రులపై వేరువేరుగా రెండు కేసులు నమోదు చేసినట్లు డిఎస్పి జీవన్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో 17 ఏళ్ల మైనర్ యువకునికి తండ్రి వేణుగోపాల్ పై, రూరల్ పోలీస్ స్టేషన్ లో 12 ఏళ్ళ బాలుడు తండ్రి నర్సయ్య పై కేసు నమోదు చేసినట్లు డిఎస్పీ వెల్లడించారు. నిర్లక్ష్యం వహించిన, నిబంధన అతిక్రమించి మైనర్లకు వాహనాలను ఇచ్చిన తల్లిదండ్రుల పై కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి అవుతున్నారని అదేవిధంగా ప్రమాదాలకు గురి చేస్తున్నారని విషయాన్ని గమనించి తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని సూచించారు. వాహన లైసెన్స్ ను పొందిన తర్వాత వాహనాలు నడపాలని లేనియెడల తల్లిదండ్రులపై అనవసరంగా కేసులు నమోదు అవుతున్నాయనే విషయాన్ని గ్రహించాలని సూచించారు.