calender_icon.png 10 May, 2025 | 8:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీపీఐ 11వ పట్టణ మహాసభలను జయప్రదం చేయండి

10-05-2025 05:04:09 PM

మందమర్రి,(విజయక్రాంతి): భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) పట్టణ 11వ మహా సభలను విజయవంతం చేయాలని సిపిఐ పట్టణ కార్యదర్శి కామెర దుర్గరాజ్ కోరారు. పట్టణంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో శనివారం మహాసభ కరపత్రాలను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. దున్నేవాడికే భూమి అనే నినాదంతో పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుందని ఆన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించడంలో ముఖ్యపాత్ర పోషించిన ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని ఆయన స్పష్టం చేశారు.

పట్టణంలో నాడు దొరలు, భూస్వాములు వారి అనుచరులు, గుండాలు ప్రజలను కట్టు బానిసలుగా చేసి చిత్రహింసలకు గురి చేసిన సమయంలో దివంగత ఏఐటీయూసీ నాయకులు వీటి అబ్రహం దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసి పేదలకు భూములు పంచిన ఘనత సిపిఐ పార్టీకి ఉందని తేల్చి చెప్పారు. ఈనెల 18న ఏఐటీయూసీ కార్యాలయంలో నిర్వహించనున్న మహాసభకు పార్టీ అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భీమనాదుని సుదర్శన్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు సలేంద్ర సత్యనారాయణ, నాయకులు బండారి రాజేశం, బియ్యాల పద్మ, ఆంటోని దినేష్, ఆర్ జనార్ధన్, ఉప్పులేటి తిరుపతి, సుంకర శ్రీనివాస్, నర్సయ్య లు పాల్గొన్నారు