calender_icon.png 10 May, 2025 | 9:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీర జవాన్ మురళీ నాయక్ కి శ్రద్దాంజలి ఘటించిన బంజారాలు

10-05-2025 04:18:32 PM

సారంగాపూర్ (విజయక్రాంతి): విధి నిర్వహణలో భాగంగా దేశ రక్షణకై  ప్రాణాలు అర్పించి అమరుడైన వీర జవాన్ మురళి నాయక్ కి మండలంలోని రామ్ సింగ్ తాండాలో గ్రామస్తులు ఉపాధి హామీ పని ప్రదేశం లో శనివారం శ్రద్ధాంజలి ఘటించారు. పది నిమిషాల పాటు మౌనం వహించి జై జవాన్ జై భారత్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం యువ నాయకుడు రాజ్ కుమార్ మాట్లాడుతూ, దేశం కోసం వీర మరణం పొందిన మురళి నాయక్ బంజారా జాతికే గర్వకారణం అని కొనియాడారు. మురళీ నాయక్ తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులని దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన కొడుకుకి జన్మనిచ్చి వారి జన్మ సుకృతం చేసుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. భాదిత సైనిక కుటుంబాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా ఆదుకొని,ఇంట్లో ఒకరికి ప్రభుత్వ కొలువు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సచిన్ జాదవ్, యువరాజ్, కుమార్ అభిలాష్ , తదితరులు పాల్గొన్నారు.