10-05-2025 03:52:35 PM
28 మందిపై రౌడీ షీట్లు ఎత్తివేత
మహబూబాబాద్, (విజయక్రాంతి): రౌడీషీటర్లకు మహబూబాబాద్ జిల్లా పోలీసులు(Mahabubabad District Police) ప్రత్యేకంగా మేళా నిర్వహించి, సత్ప్రవర్తన కలిగిన 28 మంది పై ఉన్న రౌడీ షీట్లను ఎత్తివేశారు. జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ ఆధ్వర్యంలో రౌడీషీట్ ఎత్తివేత కోసం రౌడీ షీటర్లతో ప్రత్యేకంగా మేళా నిర్వహించి నేర చరిత్రపై సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా జీవితాన్ని గడుపుతున్న 28 మందిని గుర్తించి వారిపై ఉన్న రౌడీ షీట్లు ఎత్తివేసినట్లు డి.ఎస్.పి తిరుపతిరావు తెలిపారు. రౌడీషీట్లు తొలగించిన వారు భవిష్యత్తులో ప్రశాంతమైన జీవనాన్ని గడిపేందుకు కృషి చేయాలన్నారు. నేర ప్రవృత్తి కలిగిన వారిలో మాకు తీసుకువచ్చే విధంగా సత్ప్రవర్తన తో మెలుగుతున్న వారిపై ఉన్న రౌడీషీట్లను ఎత్తివేయడం జరిగిందన్నారు. రౌడీ షీట్లు ఉన్నవారు తమ ప్రవర్తనను ఇప్పటికైనా మార్చుకొని సత్ప్రవర్తనతో మెదలాలని సూచించారు. ఈ కార్యక్రమములో సిఐలు దేవేందర్, రాజేష్, రవి, ఎస్సైలు తిరుపతి, దీపిక పాల్గొన్నారు.