calender_icon.png 11 December, 2025 | 8:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి కొండా సురేఖపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ

11-12-2025 07:31:36 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha)పై నాంపల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు(Nampally Special Court) నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కాగా, తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) పరువునష్టం కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణకు మంత్రి కొండా సురేఖ కోర్టుకు హాజరు కాలేదు. దీంతో నాంపల్లి కోర్టు కొండా సురేఖపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 5వ తేదీలోగా కొండా సురేఖ నేరుగా కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది.