22 August, 2026 | 6:03 AM

ప్లాస్టిక్ వాడకం తగ్గించుకోవాలి

22-08-2026 12:00 AM

చైర్ పర్సన్ శిరీష కృష్ణ రెడ్డి 

శామీర్‌పేట్, ఆ గస్టు 21 (విజయ క్రాంతి): సమాజం లో ఆశిస్తున్న మార్పు మన నుంచే ప్రారంభం కావాల ని, ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని అలియాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ శిరీష కృష్ణ రెడ్డి అన్నారు. ప్లాస్టిక్ వినియోగం విచ్చలవిడిగా పెరగడంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని గుర్తుచేశారు. ప్లాసి ్టక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించుకోవాలని సూచించారు. 

మున్సిపాలిటీ చేపడుతు న్న కార్యక్రమాలకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం మనం తీసుకునే చిన్న మార్పులు రేపటి తరాలకు ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందిస్తాయని పేర్కొన్నారు. ప్లాస్టిక్‌ను తగ్గించడం కేవలం మున్సిపాలిటీ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని చైర్మన్ కంఠం శిరీష కృష్ణా రెడ్డి గారు స్పష్టం చేశారు.