24 April, 2026 | 5:45 PM

ధాన్యం నిల్వతో రైతులకు అధిక లాభాలు

24-04-2026 04:07 PM

- డాక్టర్ ఏ మరియా దాస్

గరిడేపల్లి,(విజయక్రాంతి): రైతులు పండించిన ధాన్యాన్ని గిడ్డంగులలో నిల్వ చేసుకోవడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని జాతీయ మొక్కల ఆరోగ్య పరిరక్షణ సంస్థ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ తెలిపారు.మండలంలోని గడ్డిపల్లి కృషి విజ్ఞాన్ కేంద్రంలో శుక్రవారం వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ రెగ్యులేటరీ యాక్ట్, నెగోషియబుల్ వేర్ హౌస్ ల పై రైతులు, వ్యాపారులు,పప్పు మిల్లు యజమానులకు నిర్వహించిన ఒకరోజు అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా నేగోషియబుల్ వేరే హౌస్ రిసిప్ట్ అంటే ఏమిటి దాని ద్వారా రైతులు ఎలాంటి లబ్ధి పొందవచ్చు అనే అంశాలను ఆయన వివరించారు.పంట పొలంలో ఎలుకల యాజమాన్యంపై క్లుప్తంగా తెలిపారు. రైతులు ధాన్యం నిల్వ చేసినప్పుడు తగిన జాగ్రత్తలు ఆహార ధాన్యాలను రక్షించుకోవచ్చు అన్నారు.

సరైన జాగ్రత్తలు పాటించకుంటే 10 నుంచి 30% వరకు ధాన్యం చెడపురుగులు, ఎలకల వల్ల నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ధాన్యం నిల్వపై రైతులు ప్రతి ఒక్కరు సరైన అవగాహన కలిగి ఉండాలన్నారు. ధాన్యం నిల్వ ఉంచే సమయంలో ఉపయోగించే హెల్మెట్రిక్ బ్యాగుల ఉపయోగలపై ఆయన రైతులకు వివరించారు. కెవికె సత్యరక్షణ శాస్త్రవేత్త డి.ఆదర్శ్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్ తీసుకునే విధానంతో పాటు ఆ రిసిప్ట్ ద్వారా గోదాములు నిల్వ చేసుకోవడమే కాకుండా నిల్వ చేసిన ధాన్యానికి రుణ సదుపాయం తీసుకునే అవకాశం కూడా రైతులకు ఉంటుందని తెలిపారు. ఈ రిసిప్ట్ ద్వారా ఆన్లైన్ లో కూడా రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో కెవికె శాస్త్రవేత్తలు డి.ఆదర్శ్, ఏ.కిరణ్, అక్షిత సాయి, సుగంధితో పాటు వివిధ గ్రామాలకు చెందిన 50 మంది రైతులు తదితరులు పాల్గొన్నారు.