2 May, 2026 | 2:38 AM

యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణం

02-05-2026 01:36 AM

యాదగిరిగుట్ట, మే 1 : కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన పంచనారసింహుని దర్శించుకునేందుకు స్వామి వారి స్వాతీ నక్షత్రం సందర్భంగా గిరిప్రదక్షిణ చేసి స్వామి వారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు.

శుక్రవారం సామూహిక గిరి ప్రదక్షిణలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా వైకుంఠ ద్వారం వద్ద నూతనంగా ప్రతిష్టింపజేసిన స్వామివారి పాదాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య దేవస్థానం ఈవో భవానీ శంకర్ తో కలిపి గిరిప్రదక్షిణంలో గిరి ప్రదక్షిణంలో పాల్గొన్నారు.

గిరి ప్రదక్షిణ అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకి ఆలయ అర్చకులు స్వాగతం పలికి ప్రత్యేక ఆశీర్వచనo చేశారు. అనంతరం అధికారులు స్వామివారి లడ్డు ప్రసాదం అందజేసారు. గిరి ప్రదక్షిణలో రాష్ట్రం నలుమూలల నుండి వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి.