15 April, 2026 | 6:40 PM

నిఖార్సున మాస్ లీడర్ పీజేఆర్

29-12-2025 12:00 AM

హైదరాబాద్ అభివృద్ధికి, పేదల సంక్షేమానికి ఆయన కృషి చిరస్మరణీయం

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, డిసెంబర్ 28 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగర రాజకీ యాల్లో గత యాభై ఏళ్లుగా చెరగని ముద్ర వేసిన ధీశాలి, నిఖార్సున మాస్ లీడర్ పీ జనార్దన్‌రెడ్డి (పీజేఆర్) అని బీఆర్‌ఎస్ వర్కి గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. ఆదివారం పీజేఆర్ 18వ వర్ధంతి సందర్భంగా ఖైరతాబాద్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడు తూ... నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటూనే, ప్రజల ప్రయోజనాల కోసం సొంత ప్రభుత్వాన్ని నిలదీసిన ధైర్యశాలి పీజేఆర్ అని గుర్తుచేశారు. ముఖ్యంగా “కృష్ణా జలాలు తెచ్చి హైదరాబాద్ దాహార్తి తీర్చాలనే నినాదంతో ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.

తెలంగాణ రాష్ర్టం సిద్ధించిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అద్భుత అభి వృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఉంటే, పీజేఆర్ గుండె ఆనందంతో పులకించిపోయేదని కేటీఆర్ భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నగరాభివృద్ధిపై పీజే ఆర్‌కు ఉన్న విజన్‌ను బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిజం చేసిందని పేర్కొన్నారు. భవిష్యత్ తరా ల నాయకులు ఏ పార్టీకి చెందిన వారై నా, ప్రజాసేవలో పీజేఆర్ చూపిన నిబద్ధతను, శ్రద్ధను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయ న పిలుపునిచ్చారు. ప్రజాసేవలోనే కన్నుమూ సే అరుదైన భాగ్యం పీజేఆర్‌కు దక్కిందని అన్నారు. పీజేఆర్ ఆశయాలను ఆయన సుపుత్రుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని కేటీఆర్ ప్రశంసించారు.

ఒకవైపు జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయాన్ని పీజేఆర్ ఆలోచనలకు అనుగుణంగా, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ అభివృద్ధి చేయడంతో పాటు, మరోవైపు హైదరాబాద్ నగర ప్రజల సంక్షేమంలో విష్ణు తనదైన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ఏ తండ్రికైనా తన సంతానం ఇచ్చే గొప్ప ట్రిబ్యూట్ వారి ఆశయాలను కొనసాగించడమేనని, ఆ విషయంలో విష్ణువర్ధన్‌రెడ్డి సఫలమయ్యారని కేటీఆర్ అభినం దించారు. ఈ కార్య క్రమంలో మాజీ మం త్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, బండారు లక్ష్మారెడ్డి, ఎమ్మె ల్సీ దాసోజు శ్రవణ్, మాగంటి సునీత గోపీనాథ్, కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు పాల్గొని జననేతకు నీరాజనాలు అర్పించారు.