6 July, 2026 | 3:00 PM

Breaking News

విజయ క్రాంతి వార్తకు స్పందన రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •  

వంద కొట్టు.. గొర్రె పొట్టేల్ పట్టు!

30-09-2024 01:55 AM

కల్వకుర్తిలో దసరా ధమాకా ఆఫర్

నాగర్‌కర్నూల్ జిల్లాకు పాకిన లక్కీ డిప్ కల్చర్ 

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): దస రా ధమాకా ఆఫర్ అంటేనే షాపింగ్ మాల్స్‌లలో దుస్తు లు, బంగారం కొనుగోళ్లపై ఆఫర్లను చూస్తుంటాం. కానీ నేటి యువత దసరా పండుగ అంటేనే సుక్క ముక్క అనే విధంగా కొత్త సంస్కృతిని పరిచయం చేస్తున్నారు. మం చిర్యాల జిల్లా బోయపల్లి యువత నుంచి స్ఫూర్తి పొంది న కల్వకుర్తి యువత మూడు చోట్ల లక్కీడిప్ కార్యక్రమా న్ని చేపడుతున్నారు.

‘వంద కొట్టు.. గొర్రె పొట్టేల్ పట్టు’ అనే కాన్సెప్ట్‌తో పది బహుమతులను ప్రకిటించారు. జానీవాకర్, టీచర్స్, బ్లాక్‌డాగ్, హండ్రెడ్‌పేపర్ వంటి ఫుల్ బాటిళ్లను కోడి పెట్టలు, పుంజులను ఏర్పాటు చేశా రు. పోతే వంద వస్తే గొర్రె పొట్టేల్, ఫుల్‌బాటిళ్లతో దసరా పండగచేసుకోవచ్చుననే విధంగా ప్రజలు కూడా ఆసక్తి చూపుతున్నారు. వచ్చేనెల 10న లక్కీడిప్ ద్వారా విజేతను ఎంపిక చేస్తామని ప్రకటించారు.