calender_icon.png 11 May, 2025 | 5:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలంతా ఐక్యత చాటాలి మల్లన్న ఆలయంలో హోమం

10-05-2025 12:30:01 AM

 చేర్యాల మే 9 : మన ఐక్యత చాటుతూ, మన శక్తి సామర్థ్యాలను శత్రుదేశానికి చూ పించే సమయం ఆసన్నమైందని మల్లికార్జున స్వామి కార్యనిర్వాహణాధికారి అన్నపూ ర్ణ అన్నారు.

ఆపరేషన్ సింధూర్ కు మద్దతు తో పాటు దైవానుగ్రహం ఉండాలని ఆలయంలో మహాగణపతి హోమం, నవగ్రహ మన్యు శతృజయ పాశుపత హోమాన్ని ఆల య సిబ్బందితో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మనమం తా ఐక్యంగా ఉండి యుద్ధాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నారు.

ఇది కేవలం యుద్ధం మాత్రమే కాదని, ధర్మము కోసం, దేశంకోసం పోరాటమన్నారు. ఈ పోరాటంలో మన సైన్యం విజయ పథాన దూసు కెళ్లాలని ఆకాంక్షించారు. పాకిస్తాన్ కు భారతదేశం అంటే ఏంటో స్పష్టంగా చెప్పే సమ యం వచ్చేసిందన్నారు. సైనికులకు భగవంతుని అనుగ్రహం కలిగి ఉండాలని, మరింత శక్తియుక్తులను వారికి ప్రసాదించాలని, వీటి తో ఉగ్ర మూకాలను  తుది ముట్టించాలని ఈ హోమాన్ని నిర్వహించామన్నారు.

యావ త్ దేశ ప్రజలంతా యుద్ధానికి సంపూర్ణ మ ద్దతుగా నిలుస్తున్నారని,ఈ మద్దతుతో సైనికుల మనోధైర్యం రెట్టింపు అవుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మానవ శక్తికి దైవ శక్తి తోడైతే విజయానికి డోకా ఉండదని తెలిపారు. మన సైన్యం సంపూర్ణ విజయం సా ధించాలని ఆకాంక్షించారు.

అనంతరం ఆల య సిబ్బంది,అర్చకులు, ఒగ్గు పూజారులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఆలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్, సిబ్బంది బుద్ధి శ్రీనివాస్, సు రేందర్ రెడ్డి ఒగ్గు పూజారులు బొద్దుల కనకయ్య, అత్తిని పరుశరాములు, నాయకులు లింగంపల్లి శ్రీనివాస్, సాల్రా  లింగం తదితరులు పాల్గొన్నారు.