calender_icon.png 29 May, 2025 | 9:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్ విజయం సాధించాలని ప్రత్యేక పూజలు

10-05-2025 12:31:18 AM

నారాయణఖేడ్, మే 9: భారతదేశం చేపడుతున్న ఆపరేషన్ సింధూర్ 2.0 యుద్ధం లో భారతదేశం విజయం సాధించాలని జిల్లాలో ప్రసిద్ధి  చెందిన బోరంచ నల్ల పోచ మ్మ ఆలయంలో శుక్రవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మల్లన్న మాట్లాడుతూ దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. యుద్ధంలో భారత సైనికులు ఎలాంటి నష్టపోకుండా ప్రాణాపాయలు జరగకుండా చూడాలని అమ్మవారిని వేడుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, దండు సి ద్ధప్ప, పోతన్ పల్లి పెంటన్న చెట్టుకింద సిద్ధ ప్ప, పూజారులు నాగయ్య స్వామి, శ్రీకాంత్, సిద్దు స్వామి, శ్రీనివాస్ రెడ్డి, రమేష్ రెడ్డి, శేఖర్, శివకుమార్, స్థానిక భక్తులుపాల్గొన్నారు.