calender_icon.png 13 May, 2025 | 12:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయవాదుల ప్రయోజనాల కోసమే‘ఇల్ప’

13-05-2025 01:04:16 AM

 లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మనం దేవరాజ్ గౌడ్ 

నిజామాబాద్, మే 12 (విజయక్రాంతి): న్యాయవాద వృత్తి లో నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రత్యేక శిక్షణ కార్యాక్రమాలను ఏర్పాటు చేసినట్లు ఇండియన్ లీగల్ ప్రొపెషనల్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొన్నం దేవరాజ్ గౌడ్ తెలిపారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ హల్ లో ఆయన న్యాయవాదులనుద్దేశించి మాట్లాడారు.

జూనియర్ న్యాయవాదులు వృత్తిలో ఎదగడానికి కావలసిన అన్ని రకాల శిక్షణలకు శ్రీకారం చుట్టుకున్నట్టు ఆయన తెలిపారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చట్టబద్ధమైన విషయ పరిజ్ఞానం పెంపొందించడం, వ్రాత పూర్వక రాతలలో మెలకువలను నేర్పించడానికి ప్రాధాన్యత కల్పిస్తున్నామని ఆయన వివరించారు.

సమాజం నుండి ఎదిగి వచ్చిన వాళ్ళంగా సమాజం పట్ల సామాజిక బాధ్యత, ప్రజల న్యాయబద్ధమైన హక్కుల కోసం చట్టబద్ధమైన వెతుకులాటలో ఇల్ప ముందు వరుసలో నిలబడి న్యాయస్థానాలలో, ప్రభుత్వ, ప్రయివేటు విభాగాలలో బలమైన వాదనలు వినిపించి వ్యవస్థలను చట్టం వైపు నడిపిస్తుందని గౌడ్ తెలిపారు.సమాజానికి సామాజిక నిర్మాతలుగా ఉండి ప్రజాపయోగ కార్యక్రమాలలో బాగస్వాములం అవుతున్నామని ఆయన పేర్కొన్నారు.

కష్ట కాలంలో ఉన్న న్యాయవాదులకు అండగా,అనారోగ్యంతో ఉన్నవారికి, మరణించిన వారి కుటుంబాలకు ఆలంబణగా ఇల్ప ఉంటుందని చెప్పారు.  బార్ ఉపాధ్యక్షుడు దిలీప్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇల్ప రాష్ట్ర నాయకులు ఎ. ఆంజనేయులు, ఎన్ జె శ్యామ్సన్,కె. వెంకటేశ్వర్ ప్రసాద్, ఎ. సురేష్, న్యాయవాదులు బాస రాజేశ్వర్ శ్రీహరి ఆచార్య, ఆశ నారాయణ, రంజిత్ సుతారి, బైర గణేష్, అరేటి నారాయణ,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.