calender_icon.png 13 May, 2025 | 5:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సుడా చైర్మన్

13-05-2025 01:02:54 AM

కరీంనగర్ క్రైం, మే 12 (విజయక్రాంతి): నగరంలోని 11 వ డివిజన్ గౌతమ్ నగర్ లో సుడా నిధులు 15 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి షో సోమవారం శంఖుస్థాపన చేశారు. స్థానిక మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మద నర్సన్న, డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు నెల్లి నరేష్ స్థానిక ప్రజల కోరిక మేరకు ఈ పనులు చేపట్టడం జరిగిందని నరేందర్ రెడ్డి తెలిపారు.

పద్మనగర్ బైపాస్ రోడ్డ కు సమీపంలో ఉన్న ఈ కాలనీలో వర్షాకాలం వస్తే ముంపుకు గురై బురదమయంగా నడువలేకుండా తయారవుతుందని ఇండ్లలోకి నీరు చేరడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని మా దృష్టికి తీసుకు వచ్చారని, వర్షాకాలం ప్రారంభం అయ్యేవరకు పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టరును ఆదేశించామని నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పిట్టల లింగన్న, వడ్లకొండ సంపత్, చంద్రయ్య, అంజయ్య, మున్నక్క, విజయ, డీఈ రాజేంద్ర ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.