13-05-2025 01:04:53 AM
పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు
సుల్తానాబాద్, మే 12 (విజయక్రాంతి): గౌతమ బుద్ధుడి ఆలోచన విధానాన్ని ఆచరించడం అభినందనీయమని, వారి ఆశయాలు నేడు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నాయని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. సోమవారం ఎలిగేడు మండలంలోని దూళికట్ట బౌద్ధ క్షేత్రంలో 2569 గౌతమ బుద్ధ పూర్ణిమ మహోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ బుద్ధ క్షేత్రానికి రావడానికి రహదారి సరిగా లేదని తెలిపారని, రానున్న రోజులో తారు రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం బుద్ధపూర్ణిమ మహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ దేవా శ్రీనివాస్ సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర నేత్ర, అవయవ, శరీర, దాతల సంఘం సహకారంతో తన మరణానంతరం అవయము దానం చేస్తానని ముందుకు రావడంతో అవయదన పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బౌద్ధ మత సభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.