13-10-2025 09:53:00 PM
జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ప్రచారంలో బీఆర్‌ఎస్ యువ నాయకులు మాణిక్ యాదవ్..
అమీన్ పూర్: బీఆర్‌ఎస్‌కు కంచుకోటైన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గులాబీ శ్రేణులు ఉప ఎన్నిక ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు కళ్లకు గట్టినట్లు వివరిస్తున్నారు అని మాణిక్ యాదవ్ తెలిపారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ప్రచారంలో భాగంగా జూబ్లీహిల్స్ పటాన్ చెరు బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఐలాపూర్ మాణిక్ యాదవ్ విస్తృతంగా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. జూబ్లీహిల్స్ ప్రజలతో భేటీ అయి బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి విజయం కోసం పిలుపునిస్తూ ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రాంత ప్రజలతో మాట్లాడి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను వివరించామన్నారు.
జనాల్లో విపరీతమైన ఉత్సాహం, బీఆర్‌ఎస్ పక్షాన ఘన విజయాన్ని సాధించేందుకు ప్రజలు ఒక తాటిపై రావాలని అక్కడి నాయకులు కోరమన్నారు. భవిష్యత్తు అభివృద్ధి కోసం, తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు బీఆర్‌ఎస్ పార్టీని మళ్లీ గెలిపించాలని ప్రజల్లో జోష్ తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, బాల్ రెడ్డి, దేవేందర్ యాదవ్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.