25-07-2025 06:09:44 PM
మహాదేవపూర్,(విజయ క్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా ఎంపికైన కోట రాజబాపు కు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, ప్రధానోపాధ్యాయులు బి.రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ చైర్మన్ మాట్లాడుతూ విద్యార్థులు పఠనాభిరుచి పెంచుకుంటే ఎంతో విజ్ఞానం పొందే అవకాశం ఉన్నదని, పఠనాసక్తి పెంచడంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా ముఖ్యం అని అన్నారు.