26-07-2025 11:25:22 AM
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై(Chief Minister Revanth Reddy) బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డిపై బంజరాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేశారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ కల్వ సుజాత కౌశిక్ రెడ్డిపై(BRS MLA Padi Kaushik Reddy) ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులు, నటీమణుల ఫోన్ల ట్యాపింగ్ కు పాల్పడుతున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి గతం గురించి తనకు పూర్తిగా తెలుసని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) జరిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇప్పుడు ఆయన ఫోన్ ట్యాపింగ్‌లను ఆదేశించినట్లు అంగీకరిస్తున్నారని కౌశిక్ రెడ్డి తెలిపారు. కాగా, కొండాపూర్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌశిక్ రెడ్డిపై ఎన్ఎస్ యూఐ నేతలు దాడి చేస్తారని పోలీసులు అనుమానిస్తున్నారు. నిన్న సీఎంపై కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సీఎంపై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు(Congress leaders) భగ్గుమన్నారు. బీఆర్ఎస్ నేతలు కౌశిక్ రెడ్డికి మద్దతుగా వచ్చారు.
ఢిల్లీలో ఇటీవల మీడియాతో జరిగిన ఒక అనధికారిక సంభాషణను కౌశిక్ రెడ్డి ప్రస్తావించారు. ముఖ్యమంత్రి "నా ఫోన్లను అధికారులు ట్యాప్ చేస్తున్నారు, అందులో తప్పేముంది?" అని ప్రశ్నించారని ఆయన పేర్కొన్నారు. ఈ ఆరోపణ కార్యకలాపాలలో భాగంగా ముఖ్యమంత్రి తన ఫోన్‌ను, అలాగే తన భార్య ఫోన్‌ను హ్యాక్ చేశారని కౌశిక్ రెడ్డి వ్యక్తిగతంగా ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రస్తుత చర్యలు గత ప్రభుత్వంపై ఆయన చేసిన ఆరోపణలకు విరుద్ధంగా ఉన్నాయని, ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి నేరాన్ని అంగీకరించడానికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.