calender_icon.png 7 September, 2025 | 11:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ కు సన్మానం

07-09-2025 08:30:34 PM

కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా(Karimnagar District) టీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్‌గా 40 సంవత్సరాలు విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన చిక్కుడు రాజయ్యను ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి లక్ష్మణరావు, జిల్లా డిటిఓ నాగరాజు, పెన్షనర్ల సంఘం అధ్యక్షులు కేశవరెడ్డి, మోసం అంజయ్య, డాక్టర్ అరవింద్ రెడ్డి రామ్మోహన్, 4వ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కోట రామస్వామి, పట్టణ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్, నాయకులు గూడ ప్రభాకర్ రెడ్డి, మహమ్మద్ అజ్గరుద్దీన్, శ్రీనివాస్, కామురయ్య, నర్సయ్య, కోండయ్య, తదితరులు పాల్గొన్నారు.