07-09-2025 10:37:06 PM
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఆదివారం చంద్రగ్రహణం(lunar eclipse) ప్రారంభమయింది. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాలో సంపూర్ణ చంద్రగ్రహణం కొనసాగుతుండగా.. ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో పాక్షిక చంద్రగ్రహణం కొనసాగుతుంది. అలాగే భారత్ లో కూడా చంద్రగ్రహణం ప్రారంభమయింది. రాత్రి 11 గంటల నుంచి 12.22 గంటల వరకు భారత్ లో సంపూర్ణ చంద్రగ్రహణం కొనసాగనుంది. అర్థరాత్రి తర్వాత 2.25 గంటలకు చంద్రగ్రహణం వీడనుంది. చంద్రుడు 82 నిమిషాల పాటు పూర్తిగా భూమి నీడలోనే ఉండనున్నాడు.