calender_icon.png 8 September, 2025 | 2:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం

07-09-2025 10:51:18 PM

సిబ్బందిని, అభినందించిన జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల 

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలోని భైంసా, నిర్మల్ పట్టణాలతో పాటు అన్ని మండల కేంద్రాల్లో వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా విజయవంతంగా నిర్వహించినట్టు జిల్లా ఎస్పీ జానకి షర్మిల(District SP Janaki Sharmila) తెలిపారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిమజ్జన శోభాయాత్రలు కొనసాగాయి. నిమజ్జన సమయంలో భద్రతా పరంగా ముందస్తు చర్యలు తీసుకుని, సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం ద్వారా శోభాయాత్రలో ఎలాంటి అంతరాయం లేకుండా పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. క్షేత్ర స్థాయిలో శ్రమించి విధులు నిర్వర్తించిన పోలీసు అధికారులను, సిబ్బందిని అభినందించారు. అలాగే, సహకరించిన ప్రజలకు, మండప నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.