07-09-2025 11:21:50 PM
జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు..
సూర్యాపేట (విజయక్రాంతి): గ్రామీణ కబడ్డీ క్రీడాకారులలోని ప్రతివేలు వెలికి తీసేందుకు జిల్లా కబడ్డీ అసోసియేషన్(District Kabaddi Association) కృషి చేస్తుందని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అద్యక్ష, కార్యదర్శులు అల్లం ప్రభాకర్ రెడ్డి, నామా నరసింహారావులు అన్నారు. ఆదివారం కోదాడలో జరిగిన జిల్లా కబడ్డీ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడారు. కబడ్డీ క్రీడలో నైపుణ్యం పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం యువ ప్రో కబడ్డీలో పాల్గొన్న జిల్లా క్రీడాకారులకు సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్స్ కర్తయ్య క్రీస్టాఫర్ బాబు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బషీర్, వేనేపల్లి శ్రీనివాస్ రావు, కోశాధికారి మాతంగి సైదులు పందిరి నాగిరెడ్డి, సోమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రామకోటి మంగయ్య, వెంకట్ రెడ్డి, కోటయ్య, తిరుపయ్యలు పాల్గొన్నారు.